Revanth AP Tour: ఆంధ్రప్రదేశ్ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు.. ఎందుకంటే?
Revanth Bhatti Vikramarka And TS Minisiters Vijayawada Tour: ఆంధ్రప్రదేశ్ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు తరలివెళ్లనున్నారు. విజయవాడలో జరిగే వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో హాజరు కానున్నారు.
Revanth Reddy AP Tour: మరోసారి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్తున్నారు. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ షర్మిల నిర్వహించనున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ ప్రముఖుల ఏపీ పర్యటన ఖరారైంది.
Also Read: YSR Anniversary: వైఎస్ విజయమ్మ పయనమెటు? జగన్ లేదా షర్మిల
విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు జరగనున్నాయి. వైఎస్సార్ 75వ జయంతి కార్యక్రమం తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్ హాల్‌లో షర్మిల నిర్వహిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నానని అందరూ హాజరుకావాలని షర్మిల విజ్ఞప్తి చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ నుంచి షర్మిల ముఖ్యులను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే రేవంత్, భట్టి విక్రమార్కతోపాటు ఇతర మంత్రులను ఆహ్వానించారు. అంతేకాకుండా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే.
Also Read: RTC Bus Deliver: డాక్టర్‌లా మారిన కండక్టర్.. ఆర్టీసీ బస్సులో మహాలక్ష్మి పుట్టింది
అందులో భాగంగా సోమవారం రేవంత్, భట్టి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు ఏపీలో పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్తారని సమాచారం. ఆ కార్యక్రమం ముగించుకుని వెంటనే తిరుగు ప్రయాణమవుతారని తెలుస్తోంది. కాగా వైఎస్సార్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఓ సందేశం ఇచ్చారు. పార్టీకి వైఎస్సార్ చేసిన సేవలను కొనియాడారు. సోనియా సందేశానికి షర్మిల కృతజ్ఞతలు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి