Telangana Bhavan: ఇక్కడ అమలు చేయని హామీలను మహారాష్ట్రలోకి వెళ్లి రేవంత్‌ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నాడని.. అతడి మాటలన్నీ బోగస్‌ అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ సొమ్మును మహారాష్ట్ర ఎన్నికలకు తీసుకెళ్తున్నాడని ఆరోపించారు. పాలన గాలికి వదిలి గాలి మోటార్లలో మంత్రులు చక్కర్లు కొడుతున్నారని తెలిపారు. ఏడాది పాలనలో హామీలు ఎక్కడ అమలు చేశారో చర్చకు సిద్ధమని ప్రకటించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Revanth Reddy: పాలమూరు బిడ్డగా ఆ పని చేయకుంటే నన్ను చరిత్ర క్షమించదు


 


హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌ రావు మాట్లాడారు. 'నిజాలు చెప్పటానికి వెళ్లి మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పి వచ్చారు. రుణమాఫీపై మహారాష్ట్రలో రేవంత్ చెప్పినవన్నీ అబద్దాలే. రుణమాఫీ బోగస్.. రైతుబంధు బోగస్.. వరికి బోనస్. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు.. గ్యారేజ్‌కు పోయాయి. రోడ్ల మీదున్న వడ్ల కుప్పలే.. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం' అని వివరించారు.


Also Read: Harish Rao: మాజీ సీఎం కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడు


 


'2 లక్షల ఉద్యోగాలు కల్పనపై మహారాష్ట్రలో పచ్చి అబద్దాలు చెప్పారు. విద్యార్థులను వీపులు పగలకొట్టించిన చరిత్ర కాంగ్రెస్ సర్కార్‌ది' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు తెలిపారు. 40 లక్షల మందికి రుణమాఫీ చేశామని రేవంత్ అబద్దాలు చెబుతుండగా.. ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ జరగాల్సి ఉందని గుర్తుచేశారు. పూర్తి రుణమాఫీ చేసి తీరాల్సిందేనని డిమాండ్‌ చేశారు. రేవంత్ అబద్దాల ప్రవాహాన్ని మహారాష్ట్రలో కొనసాగించారని తెలిపారు. 


'గద్దెనెక్కి ఏడాది పూర్తవుతున్నా ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హమీ ఇచ్చిన వారు ఏవీ అమలు చేశారో.. ఎక్కడ చర్చిద్దాము చెప్పండి. ఆరు గ్యారెంటీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రజలకు అబద్ధాలు కాదు తెలంగాణలో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని నిజాన్ని చెప్పాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడైనా బోనస్ వస్తుందా రేవంత్ చెప్పాలని నిలదీశారు.


'ఇండ్లు కూలగొట్టావు కానీ ఒక్క ఇళ్లు కట్టావా? ఒక్క ఇళ్లు కట్టలేదు కానీ.. వందల ఇండ్లు కూలగొట్టానని చెప్పాల్సి ఉండే. ఒక్కరికైనా 5 లక్షల భరోసా కార్డు ఇచ్చావా రేవంత్?' అని హరీశ్ రావు ప్రశ్నించారు. 'ఫీజు రీయింబర్స్‌మెంట్ బంద్ పెట్టిన ఘనత రేవంత్‌ది. నేడు విద్యార్థులు, నిరుద్యోగులను రోడ్డు మీదికి తెచ్చావ్' అని తెలిపారు. రూ.4 వేలు ఫించన్ ఇస్తానని ఫించన్‌దారులను మోసం చేశారని చెప్పారు. 'ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్టు మహారాష్ట్రలో చెప్పుకోవడం సిగ్గుచేటు' అని మండిపడ్డారు. అశోక్ నగర్ లైబ్రరీలో నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేయించిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కిందని గుర్తు చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి