TPCC: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి పార్టీ హైకమాండ్ వద్ద పలుకుబడి పెరిగిందా... ఆయన వైపే ఏఐసీసీ వర్గాలు ఆసక్తి చూపిస్తున్నాయా... ఆయన్ని కాదన్న వాళ్లను ఏఐసీసీ దూరం పెడుతోందా అంటే అనుననే సమాధానం వస్తోంది. రేవంత్ రెడ్డికి  వ్యతిరేకంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం వద్ద అసమ్మతి స్వరం వినిపించేందుకు ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ పెద్దలను ఢిల్లీ పెద్దలు దూరం పెట్టారు. తమ మొర చెప్పుకునేందుకు హస్థినకు వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్‌గాంధీతో పాటు పార్టీ ప్రధాన  కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ కూడా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో అసమ్మతి నేతలు నిరాశగా హైదరాబాద్ కు వెనుదిరగాల్సి వచ్చింది. పార్టీ ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమకు మద్దతిస్తారని ఈ నేతలు భావించగా వాళ్లు కూడా సహకరించలేదని తెలుస్తోంది. హస్తిన పెద్దల అపాయింట్ మెంట్ ఇప్పించడంలో వాళ్లు కూడా వెనుకాడినట్లు సమాచారం. దీంతో చేసేదేమీ లేక తిరుగుముఖం పట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి.. త్వరలో జరగనున్న కాంగ్రెస్‌ పునర్వ్యవస్థీకరణలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవిని ఆశిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో తలదూర్చడం సరైంది కాదని భావిస్తున్న ఆయన తెలంగాణ కాంగ్రెస్ నేతలతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. దీంతో అసమ్మతి స్వరంగ వినిపించాలనుకున్న నేతలు ఉత్త చేతులతో తిరిగి రావాల్సి వచ్చింది.


ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రదేశ్ కాంగ్రెస్ నేతలు తమ దగ్గరకు వచ్చినప్పుడు నేతలంతా సమిష్టిగా పనిచేయాలని  పార్టీ ఎంపీలతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సోనియా , రాహుల్ చెప్తుూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ దగ్గరకు తెలంగాణ నుంచి వచ్చే నేతలకు ఇందుకు భిన్నంగా ఏం చేప్తారని ఢిల్లీ వర్గాలు గుసగుస లాడుకుంటున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇకపై ఏ రాష్ట్రంలోనూ అసమ్మతి కార్యకలాపాలను ప్రోత్సహించకూడదని అధిష్ఠానం తీర్మానించుకున్నట్లు సమాచారం. ఆయా రాష్ట్ర నేతలకు కూడా ఇవే సంకేతాలుపంపినట్లు సమాచారం. 


రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన తర్వాతే తెలంగాణ కాంగ్రెస్ లో కాస్తో కూస్తో చలనం రావడం....పైగా తను చేపట్టబోయే కార్యక్రమాలన్నింటినీ ముందుగానే రేవంత్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శికి, ఇన్‌చార్జులకు తెలియజేస్తుండడం కూడా ఆయనకు కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా రేవంత్‌కు వ్యతిరేకంగా ఎవరు ఎలాంటి ప్రచారం చేసినా అధిష్ఠానం నమ్మే పరిస్థితిలో లేదని తెలుస్తోంది. కనీసం 20 మంది బలమైన నేతలు ఢిల్లీ వచ్చి రేవంత్‌కు వ్యతిరేకంగా నిరంతరం అసమ్మతిని ప్రచారం చేస్తే తప్ప... ఆయన్ని ఇప్పట్లో డిస్ట్రబ్ చేసే పరిస్థితి లేదని సమాచారం. మరోవైపు రేవంత్ వ్యతిరేక శిబిరానికి ఢిల్లీలో అంత పలుకుబడి లేకపోవడంతో కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది.


Also read: Attack on CM: సీఎం భద్రతలో లోపం.. దాడికి యత్నించిన యువకుడు!


Also read: Shiva Lingam: కోర్టుకు హాజరైన శివ లింగం.. నెట్టింట్లో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook