SC, ST Decleration: చేవెళ్ల ప్రజాగర్జన సభలో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Revanth reddy Speech at SC, ST Decleration: తొమ్మిదేళ్లలో కేసీఆర్ చేతిలో అత్యధికంగా దగాకు గురైంది దళితులు, గిరిజనులే అని రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో తెలంగాణ నెంబర్ వన్ అంటున్నారు. అవును.. 60 వేల బెల్టు షాపులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.
Revanth Reddy Speech at SC, ST Decleration: రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. సామాజిక తెలంగాణ కోసమే మనం తుది దశ తెలంగాణ పోరాటం మొదలుపెట్టామన్నారు. సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమాన అభివృద్ధి కాంగ్రెస్ విధానం అయితే తెలంగాణను తాగుబోతుల అడ్డా చేయడం కేసీఆర్ ఆలోచన అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం చేవెళ్లలో నిర్వహించిన ప్రజాగర్జన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తొమ్మిదేళ్లలో కేసీఆర్ చేతిలో అత్యధికంగా దగాకు గురైంది దళితులు, గిరిజనులే అని రేవంత్ రెడ్డి అన్నారు. దళితులు, గిరిజనులు ఆదుకునేందుకు సోనియా గాంధీ సూచనతో మల్లిఖార్జున ఖర్గే ఇక్కడకు విచ్చేశారు. వైఎస్ హయాంలో చేవెళ్ల గడ్డపై నుంచి కాంగ్రెస్ జెండా ఎగిరింది.. అలాంటి ఈ గడ్డపై నుంచి డిక్లరేషన్ ను ప్రకటించడం నా జన్మ ధన్యమైందని రేవంత్ వ్యాఖ్యానించారు. దేశంలో తెలంగాణ నెంబర్ వన్ అంటున్నారు. అవును.. 60 వేల బెల్టు షాపులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.
తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను గౌరవించి సోనియా తెలంగాణ ఇచ్చారు కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేళ్లలో 10వేల ఎకరాలు ఆక్రమించుకుండు, లక్ష కోట్లు వెనకేసుకున్నాడు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇల్లు, దళితులకు మూడెకరాలు, మైనారిటీలకు, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ల హామీలను అటకెక్కించారన్నారు. మొన్న రాష్ట్రంలో 115 సీట్లలో ఒక్క ముదిరాజ్ కు కూడా టికెట్ ఇవ్వలేదు. 50 శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. ఒక్క మాదిగ బిడ్డకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. అసలు తెలంగాణలో సామాజిక న్యాయం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు రేవంత్ రెడ్డి. మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టాక.. మొదటి విజయం హిమాచల్ ప్రదేశ్ లో సాధించాం. రెండో విజయం కర్ణాటకలో నమోదు చేసుకున్నాం. మూడో విజయం తెలంగాణలో సాధిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్
చేవెళ్ల ప్రజా గర్జన సభలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిక్లరేషన్ ను విడుదల చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను ప్రకటించారు.
డిక్లరేషన్ లోని అంశాలు..
1. ఎస్సీ రిజర్వేషన్ల పెంపు - ఎస్సీ వర్గీకరణ:
a. జనాభా దామాషా ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లు 18%కి పెంపు. ఎస్సీ రిజర్వేషన్లలో
ఏ, బి, సి, డి వర్గీకరణ అమలుకై గట్టి చర్యలు.
2. అంబేద్కర్ అభయ హస్తం:
a. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షల ఆర్ధిక సాయం అందజేత. వచ్చే ఐదేళ్లలో ప్రతి బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించి, పూర్తి స్థాయిలో పథకం అమలు.
3. ప్రత్యేక రిజర్వేషన్లు:
a. ప్రభుత్వ ప్రొక్యూర్ మెంట్ మరియు అన్ని కాంట్రాక్టులలో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు. ప్రైవేట్ విద్యా సంస్థలలో, ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందే ప్రైవేట్ కంపెనీల్లో రిజర్వేషన్ల కల్పన.
4. ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం:
a. ఇళ్లులేని ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు అందజేత. ఐదేళ్లలో అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఈ పథకం వర్తింపు.
5. అసైన్డ్ భూముల పునరుద్ధరణ - సమాన హక్కులు
a. బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను తిరిగి అసైనీలకే అన్ని హక్కులతో పునరుద్ధరణ.
b. ప్రజా ప్రయోజనార్థం, భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూములను సేకరించినప్పుడు, అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం.
6. పోడు పట్టాల పంపిణీ:
a. శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ తెచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి, అర్హులైన అందరికీ పోడు భూముల పట్టాలు పంపిణీ.
7. సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం (SSGGAP Scheme):
a. ఈ పథకం కింద ప్రతి గూడెం, తండా గ్రామ పంచాయతీలకు ఏటా రూ.25 లక్షలు కేటాయింపు.
8. 3 ఎస్సీ కార్పొరేషన్ల ఏర్పాటు:
a. మాదిగ, మాల, మరియు ఇతర ఎస్సీ ఉపకులాలకు కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, ప్రతి ఏడాది ఒక్కో కార్పొరేషన్కు రూ.750 కోట్ల నిధుల మంజూరు.
9. 3 ఎస్టీ కార్పొరేషన్ల ఏర్పాటు:
a. తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, మరియు ఎరుకుల కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, ప్రతి ఏడాది ఒక్కో కార్పొరేషన్కు రూ.500 కోట్ల నిధుల మంజూరు.
10. 5 కొత్త ఐటీడీఏలు - 9 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు:
a. మైదాన ప్రాంత ఎస్టీల కోసం నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్ లలో 5 కొత్త ఐటీడీఏల ఏర్పాటు. అన్ని ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల స్థాపన.
11. విద్యా జ్యోతులు పథకం:
a. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పదవ తరగతి పాసైతే రూ.10,000, ఇంటర్ పాసైతే రూ. 15,000, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ. 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ. లక్ష అందజేత.
b. ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ యువతకు రూ.5 లక్షలు అందజేత.
ఇది కూడా చదవండి : Kamareddy MLA Election: కామారెడ్డిలో కేసిఆర్ ఇక గెలిచినట్టేనా ?
12. రెసిడెన్షియల్ స్కూళ్ళు, హాస్టల్స్, మరియు విదేశాల్లో విద్య:
a. ప్రతి మండలంలో ఒక గురుకులం ఉండేలా ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు.
b. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టడంతో పాటు, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరికి హాస్టల్ సదుపాయ కల్పన.
c. విదేశాల్లోని యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేత.
ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి