COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Revanth Reddy Comments:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపుపై రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 3, 2009న శ్రీకాంతచారి అమరుడయ్యాడని, ఇవాళ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చి శ్రీకాంతాచారికి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞత తెలిపే అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అధికారం అప్పగించి మాపై మరింత బాధ్యతను పెంచారన్నారు. జోడో యాత్ర ద్వారా తెలంగాణలో రాహుల్ గాంధీ స్ఫూర్తిని నింపారన్నారు.


తెలంగాణతో తమది కుటుంబ అనుబంధమని చెప్పి రాహుల్ గాంధీ ప్రజల్లో విశ్వాసం నింపారన్నారు రేవంత్‌ రెడ్డి. రాహుల్ గాంధీ అండతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నామని రేవంత్‌ రెడ్డి తెలిపారు. త్వరలోనే తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్షాలు హేతుబద్ధంగా వాదించేందుకు కాంగ్రెస్ అవకాశం ఇస్తుందన్నారు.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


ప్రజల తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు రేవంత్‌ రెడ్డి..ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి విపక్షాలతోపాటు అందరినీ ఆహ్వానిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని భరోసానిచ్చారు. ప్రభుత్వంలో సీపీఐ, జనసమితి ఆలోచనలను స్వీకరిస్తామన్నారు. కూటమి గెలుపుకు సహకరించినందుకు సీపీఐ, కోదండరాం గారికి కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు.


ప్రజా తీర్పును బీఆర్‌ఎస్ శిరసావహించాలన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు వారి వైపు నుంచి సహకారం ఉంటుందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు బీఆర్‌ఎస్ సహకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. పరిపాలన ఇక గతంలోలా ఉండని రేవంత్‌ రెడ్డి తెలిపారు. సచివాలయ గేట్లు సామాన్యులకు తెరిచే ఉంటాయని, ప్రగతి భవన్ ను డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ భవన్‌గా మారుస్తామన్నారు. సామాన్యులకు కూడా ప్రగతి భవన్‌లోకి ప్రవేశం ఉంటుందన్నారు.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి