BC Reservations: గడువు ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటుచేసిన కమిషన్‌పై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసి డెడికేషన్‌ కమిషన్‌ వేయాలని మొట్టికాయలు వేయడంతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం స్పందించింది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానం ఆదేశాలకు అనుకూలంగా డెడికేషన్‌ కమిషన్‌ వేస్తామని రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Harish Rao: ఎన్నికల్లో రైతుల ఓట్లు కావాలి.. రైతుల వడ్లు వద్దా రేవంత్‌ రెడ్డి?


 


స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యంలో ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రేవంత్‌ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్​ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌తో సమావేశమయ్యారు. బీసీ రిజర్వేషన్లపై కమిటీ ఏర్పాటు విషయమై వారితో చర్చించారు.

Also Read: KTR Padayatra: ప్రజాక్షేత్రంలోకి కేటీఆర్‌.. పాదయాత్ర చేసేది అక్కడి నుంచే!


 


రాష్ట్రంలో ఈనెల 6వ తేదీ నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వే ప్రారంభించనున్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేలా చూడాలని మంత్రులు, అధికారులు తెలిపారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని స్పష్టం చేశారు. అందరి అభిప్రాయాల మేరకు వెంటనే బీసీ డెడికేటేడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రేపటిలోగా ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పారు.


కుల గణన, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో ఇటీవల హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వాటిపై కూడా ప్రభుత్వం పున:సమీక్ష చేపట్టింది. న్యాయస్థానం సూచన ప్రకారం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవని స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వం తెలిపింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.