Telangana Govt House Scheme: పథకాల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం వేగిరం పెంచింది. ఈ క్రమంలోనే మరో హామీ నిలబెట్టుకునేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 11వ తేదీన ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ పథకం ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావించాలని సూచించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: SkyWay: పదేళ్ల మా పోరాటం ఫలించింది.. రేవంత్‌ సర్కార్‌ పనులు చేయాలి: కేటీఆర్‌


హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో శనివారం గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ పధాన కార్యదర్శి శాంతికుమారితో రేవంత్‌ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల పథకంపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై  చర్చించారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ ఈ పథకం అమలుచేయడానికి విధి విధానాలను తయారు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. 

Also Read: BJP Candidates: బిగ్‌ బ్రేకింగ్‌.. బీజేపీ అభ్యర్థుల ప్రకటన.. పంతం నెగ్గించుకున్న ఆ ముగ్గురు


ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి  3,500 ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో నమోదు చేసుకున్న అర్హులందరికీ తొలి ప్రాధాన్యమివ్వాలని సీఎం చెప్పారు. గత బీఆర్ఎస్‌ పార్టీ ప్రభుత్వం డబుల్ ఇండ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా అర్హులకు లబ్ధి జరిగేలా చూడాలని తెలిపారు. దశల వారీగా పేదల సొంతింటి కల నెరవేర్చడం ప్రభుత్వ సంకల్పమని వివరించారు. ఏయే దశల్లో ఈ నిధులను విడుదల చేయాలనే నిబంధనలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.


మార్గదర్శకాలు ఇవే..
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తారు.
ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి