BJP Candidates: బిగ్‌ బ్రేకింగ్‌.. బీజేపీ అభ్యర్థుల ప్రకటన.. పంతం నెగ్గించుకున్న ఆ ముగ్గురు

BJP MP Candidates: సార్వత్రిక ఎన్నికలకు కమలం పార్టీ సన్నద్ధమైంది. ఈ క్రమంలోనే దేశంలోని కొన్ని స్థానాలతోపాటు తెలంగాణలోని కీలక స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఈ జాబితాలో ముగ్గురు మాత్రం తమ పంతం నెగ్గించుకున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 2, 2024, 07:39 PM IST
BJP Candidates: బిగ్‌ బ్రేకింగ్‌.. బీజేపీ అభ్యర్థుల ప్రకటన.. పంతం నెగ్గించుకున్న ఆ ముగ్గురు

BJP MP Candidates List: మూడోసారి అధికారం సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న అధికార బీజేపీ ఈ మేరకు గెలుపుగుర్రాలను ప్రకటించింది. ఈసారి వీలైనన్ని అత్యధిక స్థానాలు సొంతం చేసుకోవాలని భావించిన కమలం పార్టీ అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేసింది. ఇక తెలంగాణలోని 17 స్థానాలకు 9 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. వారిలో నలుగురు సిట్టింగ్‌ ఎంపీలు ఉండగా.. ఇద్దరు మాజీ ఎంపీలు, మరొకరు మాజీ ఎమ్మెల్యే, మహిళా కోటాలో మాధవీలతను అభ్యర్థులుగా ప్రకటించడం గమనార్హం.

Also Read: LPG Gas Cylinder Stole: దర్జాగా 'కారు'లో వచ్చి 'సిలిండర్‌' దొంగలించిన యువకులు

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోకుండా బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఎమ్మెల్యే ఎన్నికల్లో బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ తదితరులు ఓడిపోయినా వారికి ఎంపీ టికెట్లు కేటాయించడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల్లో పాటించిన 'బీసీ వ్యూహం' పార్లమెంట్‌ సమరంలో కూడా కాషాయ పార్టీ పాటిస్తున్నట్లు అభ్యర్థుల జాబితాను చూస్తే తెలుస్తోంది. ప్రకటించిన అభ్యర్థుల్లో అత్యధికంగా బీసీ సామాజికవర్గానికి ఉండగా.. రెడ్డి, ఎస్సీ వర్గానికి అవకాశం కల్పించారు.

Also Read: Road Kalyanam: అంగరంగ వైభవంగా 'రోడ్డు' పెళ్లి.. మీరు చదివేది నిజమే రోడ్డుకు పెళ్లి

రాష్ట్రంలోని ఇంకా 8 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేదు. నాగర్‌కర్నూల్‌, నల్లగొండ, మెదక్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, వరంగల్‌, మహబూబాబాద్‌, పెద్దపల్లి స్థానాల అభ్యర్థుల విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ, మెదక్‌, వరంగల్‌ వంటి జిల్లాల అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. మహబూబ్ నగర్, ఆదిలాబాద్‌ స్థానాల అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ రేకెత్తుతోంది. మహబూబ్ నగర్ స్థానం కోసం పార్టీ సీనియర్‌ నాయకురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇక అదిలాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపురావు పోటీ సందిగ్ధతలో ఉంది. ఆయనకు ఈసారి మొండిచేయి చూపే అవకాశం ఉంది.

కాగా.. అభ్యర్థుల ప్రకటనలో ముగ్గురు నాయకులు తమ పంతం నెగ్గించుకున్నారు. ఎన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినా కూడా సిట్టింగ్‌ ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌ తమ స్థానాలను తిరిగి పొందారు. మొదటి నుంచి మల్కాజిగిరి రేసులో ఉన్నట్టు ప్రకటిస్తున్న ఈటల రాజేందర్‌ అన్నట్టుగానే టికెట్‌ సంపాదించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన ఈటలకు కీలకమైన మల్కాజిగిరి స్థానం దక్కించుకోవడం గమనార్హం.

బీజేపీ తెలంగాణ ఎంపీ అభ్యర్థులు వీరే..

  • కరీంనగర్ - బండి సంజయ్ కుమార్‌ (సిట్టింగ్‌)
  • నిజామాబాద్ - ధర్మపురి అరవింద్ (సిట్టింగ్‌)
  • మల్కాజిగిరి - ఈటెల రాజేందర్ (మాజీ ఎమ్మెల్యే)
  • భువనగిరి - బూర నర్సయ్య గౌడ్ (సీనియర్‌ నాయకుడు)
  • చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్ రెడ్డి ,
  • సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి (సిట్టింగ్‌)
  • హైదరాబాద్ - మాధవి లత 
  • నాగర్ కర్నూల్ - భరత్ కుమార్ (బీఆర్ ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ కుమారుడు) 
  • జహీరాబాద్ - బీబీ పాటిల్ (బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News