Vikarabad Collector Incident: పరిపాలనా వైఫల్యం, శాంతిభద్రతల వైఫల్యానికి రేవంత్‌ రెడ్డి కారణమని.. అందులో భాగంగానే వికారాబాద్‌ కలెక్టర్‌పై జరిగిన దాడి అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రేవంత్‌ రెడ్డి కుత్సిత బుద్ధితోనే ఈ సంఘటన జరిగిందని పేర్కొన్నారు. అధికారులపై రైతుల దాడి దురదృష్టకరమని చెప్పారు. రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఇలాంటి సంఘటన జరగడం చూస్తుంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతోందన్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: IAS Transfers: భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. స్మితా సబర్వాల్‌కు రేవంత్‌ రెడ్డి ప్రమోషన్‌


రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌పై జరిగిన దాడి అంశంపై కేటీఆర్‌, హరీశ్ రావు 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. 'రాష్ట్రంలో పరిపాలనా వైఫల్యం, శాంతిభద్రతల వైఫల్యానికి తాజా ఉదాహరణ ఇవ్వాళ రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్‌లో ఏకంగా జిల్లా కలెక్టర్ మీదనే తిరగబడ్డ రైతులు. ముఖ్యమంత్రి మూర్ఖత్వం వల్ల అధికారులు దెబ్బలు తినాల్సి రావడం దురదృష్టకరం' అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Also Read: Ponguleti ED Raids: బీజేపీ ముందు మోకరిల్లిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. నిజం కాదా?: బీఆర్‌ఎస్‌ పార్టీ


ఫార్మా సిటీ రద్దుతోనే..
'నిజానికి రేవంత్ రెడ్డి దురాశ వల్ల, అవగాహనారాహిత్యం వల్లనే ఈ దుస్థితి దాపురించింది. భూసేకరణ పూర్తయి అన్ని అనుమతులు వచ్చి.. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫార్మాసిటీని రద్దు చేసి రాష్ట్రంలో పది చోట్ల ఫార్మా క్లస్టర్లు పెట్టాలనే తుగ్లక్ అలోచన వల్లనే ఇంత అలజడి రేగింది' అని కేటీఆర్‌ వివరించారు. 'ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములు అమ్ముకొని సొమ్ము చేసుకుందామన్న రేవంత్ కుత్సిత బుద్ధితోనే ఇప్పుడు ఇక్కడ ఫార్మా సిటీ భవితవ్యం ప్రమాదంలో పడింది. అక్కడ కొడంగల్‌లో అన్నదాతల భూములు గుంజుకునే కుట్ర మొదలైంది' అని కేటీఆర్‌ ఆరోపించారు. 'రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, ఆగ్రహం, చాలాచోట్ల కట్టలు తెంచుకుంటోంది. అది ఈ అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని త్వరలోనే భూస్థాపితం చేయనుంది' అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.


హరీశ్ రావు స్పందన ఇదే..
కలెక్టర్‌ దాడి ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు 'ఎక్స్‌' వేదికగా స్పందిస్తూ.. 'ఇది ప్రజా పాల‌న కాదు.. ప్రజ‌లు తిర‌గ‌బ‌డుతున్న పాల‌న‌.. ఏడాదిలోనే ఎదురీదుతున్న పాల‌న‌' అని తెలిపారు. 'ఆంక్షలు పెట్టి.. ప్రజాకాంక్షలను తొక్కేస్తామంటే తెలంగాణ నేల ఊరుకోదు' అని స్పష్టం చేశారు. 'తెలంగాణ తిర‌గ‌బ‌డుతుంది.. త‌రిమికొడుతుంది.. త‌స్మాత్ జాగ్రత్త!' అని కేటీఆర్‌ హెచ్చరించారు. 'ఫార్మా రైతులకు న్యాయం చేస్తామని కల్లిబొల్లి కబుర్లు చెప్పినోళ్లు.. రేవంత్..సెక్యూరిటీ లేకుండా నీ సొంత జిల్లా దుద్యాల మండలానికి వెళ్లే దమ్ముందా?' అని హరీశ్‌ రావు నిలదీశారు. 'మీ మోసాలకు అధికారులను ఎందుకు బలిపశువులు చేస్తారు?' అని ప్రశ్నించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి