Y Satish Reddy: ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు జరిగి నెలన్నర గడిచినా ఇంకా ఎలాంటి వివరాలు బయటకు రాకపోవడంతో పొంగులేటి శ్రీనివాస రెడ్డి వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అతడి అక్రమ సంపాదన, ఆర్థిక నేరాలపై భారత రాష్ట్ర సమితి పార్టీ నిలదీస్తోంది. పొంగులేటి అవినీతిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతోపాటు గులాబీ పార్టీ కొన్ని ప్రశ్నలు సంధించింది. ఈడీ దాడుల నుంచి విముక్తి కోసం బీజేపీ ముందు పొంగులేటి మోకరిల్లాడని విమర్శించింది. ఇది నిజం కాదా? అంటూ బీఆర్‌ఎస్ పార్టీ ప్రశ్నించంది.
Also Read: Padi Kaushik Reddy: కలెక్టర్ మాదిరి రేవంత్ రెడ్డిని కూడా ఉరికించే పరిస్థితి వస్తది
బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్ రెడ్డి 'ఎక్స్' వేదికగా పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఈడీ దాడుల విషయంలో ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. 'మొన్న ఈడీ కేసులలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరి కాళ్లు పట్టుకుని బయటపడ్డారు?' అని ఆరోపించారు. ఈడీ దాడుల నేపథ్యంలో నగదు లెక్కింపు యంత్రాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లోకి తీసుకుని వెళ్లింది అందరికీ తెలిసిందే? మరి ఏం లెక్కించారు? ఏం చేశారు? అని ప్రశ్నించారు.
Also Read: Vikarabad: కలెక్టర్‌పై మహిళ దాడిని ఖండించిన ఉద్యోగ సంఘాలు.. డీజీపీకి ఫిర్యాదు
'ఈడీ దాడుల తర్వాత దేనికోసం దాడులు చేశారు? ఏం లభించింది? ఎందుకు దాడులు చేశారు ? అని మీడియాకు ఎందుకు వెల్లడించలేదు?' అని సూటిగా సతీశ్ రెడ్డి నిలదీశారు. 'ఏ హోటట్‌లో ఎవరి కాళ్లు పట్టుకుంటే పొంగులేటిని వదిలేశారు? అని అడిగారు. 'రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్, బీజేపీలతో కూడిన కల్తీ ప్రభుత్వం కాదా? ఈడీ దాడుల నుంచి విముక్తి కోసం బీజేపీ ముందు మోకరిల్లిన పొంగులేటి కేటీఆర్ గురించి మాట్లాడడం అవివేకం, ఆశ్చర్యకరం'గా ఉందని తెలిపారు.
అబద్దపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ హామీలపై అడుగడుగునా నిలదీస్తామని వై సతీశ్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకాన్ని నడిబజారులో బట్టలిప్పదీసి ఎండగడుతున్నందుకే కాంగ్రెస్ మంత్రులు కేటీఆర్ మీద నిందలేస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ సీఎం, మంత్రులు ఎంత గింజుకున్నా కేటీఆర్ నిరంతరం ప్రజల ముందు నిలదీస్తూనే ఉంటారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా కాంగ్రెస్ వైఫల్యాలను.. రేవంత్ రెడ్డి తప్పిదాలపై నిలదీస్తుందని స్పష్టంగా చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి