Revanth Reddy Lunch Cost: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని నవంబర్ 20వ తేదీన రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు, అధికారులు సందర్శించారు. వీఐపీల కోసం ప్లేటు భోజనానికి రూ.3000 ఖర్చు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజా పాలన విజయాల పేరిట గత నెల వేములవాడలో కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు వేములవాడకు వచ్చారు. వీరితోపాటు ఇతర వీఐపీలకు అధికార లాంఛనాలతో స్వాగతం పలికిన అధికారులు రాజన్న దర్శనం కల్పించారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: K Kavitha: కల్వకుంట్ల కవిత సంచలనం.. రేవంత్‌ రెడ్డిని ధిక్కరించి తెలంగాణ తల్లికి శంకుస్థాపన


ఈ సందర్భంగా వంద మంది వీఐపీలకు భోజనాలు పెట్టేందుకు హైదరాబాద్‌లోని తాజ్ హోటల్ సిబ్బంది వచ్చారు. దేవస్థానం చైర్మన్‌కు చెందిన చాంబర్‌ను ఫైవ్ స్టార్ హోటల్‌గా మార్చి అక్కడే వండి భోజనాలు పెట్టారు. ఆ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం వండి వడ్డించారు. మొత్తం 100 మందికి వంట చేసి భోజనాలు పెట్టినట్టు హోటల్ యాజమాన్యం తెలిపింది. దీనికి సంబంధించిన బిల్లులను రాజన్న ఆలయ ఈవోకు పంపినట్లు వార్త బయటకు వచ్చింది.


Also Read: Danam Nagender: రేవంత్‌ రెడ్డికి ఎమ్మెల్యే దానం నాగేందర్‌ షాక్‌.. అల్లు అర్జున్‌ అరెస్ట్‌ ఖండన


ఆ బిల్లులో రూ.17 లక్షలు, రవాణా, వెయిటర్, భోజనాల కోసం వేసిన డెకరేషన్ ఖర్చులు కలిపి ఇలా మొత్తం రూ.15 లక్షలు బిల్లు అయినట్లు తెలుస్తోంది. వందమంది భోజనాల ఖర్చు కింద రూ.32 లక్షలు చెల్లించాలని పేర్కొంటూ  బిల్లులు పంపరనే వార్త కలకలం రేపుతోంది. కాగా ఆరోజు రేవంత్‌ రెడ్డి, వీఐపీలు చేసిన భోజనం ఖరీదు అక్షరాల రూ.32,000 అని వినిపిస్తోంది. అయితే ఈ బిల్లుల వ్యవహారం రాజన్న ఆలయంపై పడింది. ఆలయ అధికారులు చెల్లిస్తారని ఒక ఉన్నతాధికారి చెప్పడంతో హోటల్ యజమాన్యం రాజన్న ఆలయ ఈఓకు బిల్లు పంపించడంతో ఒక్కసారిగా ఈ వార్త బయటకు పొక్కింది. అయితే భోజనాల ఖర్చు భారీగా ఉండడంతో తాము చెల్లించలేమని రాజన్న ఆలయ అధికారులు చెప్పడంతో ఆ ఫైల్‌ సిరిసిల్ల కలెక్టర్ వద్దకు చేరినట్లు సమాచారం.


ముఖ్యమంత్రి భోజనం వ్యవహారం రాజకీయ దుమారానికి తెర లేపింది. ఒక ముఖ్యమంత్రి భోజనం ఖర్చు రూ.3,200 అని తెలవడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజా పాలన అని పేరు చెప్పి ప్రజా సొమ్మును విచ్చలవిడిగా తినేస్తున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీలు మండిపడుతున్నాయి. రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యాక ప్రజా సొమ్మును నీళ్లలా ఖర్చు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter