Revanth Reddy: టీఆర్ఎస్, బీజేపీ కీలక నేతలకు రేవంత్ రెడ్డి గాలం! రాహుల్ సిరిసిల్ల సభలో సంచలనం?
Revanth Reddy: తెలంగాణ రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాలో ఉన్న విపక్షాలు దూకుడుగా వెళుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ హైకమాండ్ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేశాయి. ఆ పార్టీల అగ్రనేతలు తెలంగాణకు క్యూకడుతున్నారు.
Revanth Reddy: తెలంగాణ రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాలో ఉన్న విపక్షాలు దూకుడుగా వెళుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ హైకమాండ్ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేశాయి. ఆ పార్టీల అగ్రనేతలు తెలంగాణకు క్యూకడుతున్నారు. హైదరాబాద్ లోనే జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించింది బీజేపీ. బీజేపీ అగ్రనేతలంతా రెండు రోజులు హైదరాబాద్ లో ఉన్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ నిర్వహించారు. మే నెలలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించారు. వరంగల్ రైతు సంఘర్షణ సభలో మాట్లాడారు. రెండు నెలల్లోనే మరోసారి తెలంగాణ వస్తున్నారు రాహుల్ గాంధీ. ఆగస్టు2న తెలంగాణ పీసీసీ సిరిసిల్లలో నిరుద్యోగ గర్జన నిర్వహిస్తోంది. ఆ సభకు హాజరుకాబోతున్నారు రాహుల్. సిరిసిల్ల నుంచి మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేటీఆర్ గడ్డపై పీసీసీ సభ నిర్వహిస్తుండటం.. రాహుల్ గాంధీ వస్తుండటం ఆసక్తిగా మారింది. సిరిసిల్లలో రాహుల్ గాంధీ సభ పెట్టడం వెనుక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పెద్ద స్కెచ్ వేశారని అంటున్నారు. రాహుల్ సిరిసిల్ల సభలో సంచలనం జరగబోతుందనే లీకులు గాంధీభవన్ వర్గాల నుంచి వస్తున్నాయి.
తెలంగాణలో ప్రస్తుతం వలసల పర్వం కొనసాగుతోంది. విపక్ష బీజేపీ, కాంగ్రెస్ లు ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీశాయి. అధికార పార్టీలోని అసమ్మతి నేతలకు గాలం వేస్తూ తమ పార్టీలో చేరేలా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ఏకంగా చేరికల కమిటీలను ఏర్పాటు చేసుకున్నాయి. కాంగ్రెస్ చేరికల కమిటీ కన్వీనర్ గా సీనియర్ నేత జానా రెడ్డి ఉండగా.. బీజేపీ చేరికల కమిటి బాధ్యతలు మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు అప్పగించారు. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెబుతున్న కాంగ్రెస్, బీజేపీలు.. వలసల విషయంలో పోటీ పడుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత బీజేపీలో భారీగా చేరికలు జరగగా.. ఇటీవల కాంగ్రెస్ లో ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. ఇటీవలే మాజీ ఎమ్మెల్యేలు నల్లాల ఓదేలు, ఎర్రశేఖర్, తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ గూటికి చేరారు. గ్రేటర్ కార్పొరేటర్ విజయా రెడ్డి, కొందరు నియోజకవర్గ స్థాయి నేతలు కూడా హస్తం పార్టీలో చేరిపోయారు. ఇటీవలే బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ గా నియమితులైన ఈటల రాజేందర్ తన ఆపరేషన్ మొదలు పెట్టారని తెలుస్తోంది. అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలతో పాటు కాంగ్రెస్ నేతలతో ఆయన మాట్లాడుతున్నారని తెలుస్తోంది.
చేరికలపై బీజేపీ ఫోకస్ చేయడంతో అప్రమత్తమైన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారని అంటున్నారు. అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీకి షాకిచ్చేలా ఆయన స్కెచ్ వేశారని తెలుస్తోంది. దాదాపు 20 మంది కీలక నేతలు రేవంత్ రెడ్డి టచ్ లోకి వచ్చారని అంటున్నారు. సిరిసిల్ల రాహుల్ గాంధీ సభలో టీఆర్ఎస్ తో పాటు బీజేపీలో ఉన్న కొందరు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తోంది.ఇటీవలే హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఠాగూర్ లు అర్దరాత్రి వేళ కొందరు నేతలతో చర్చలు జరిపారని అంటున్నారు. టాక్స్ సక్సెస్ కావడంతో టీఆర్ఎస్, బీజేపీకి చెందిన కీలక నేతలు రాహుల్ గాంధీ సభలో కాంగ్రెస్ కుండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారని సమాచారం. అయితే రేవంత్ రెడ్డి ఎవరితో చర్చలు జరిపారు.. రాహుల్ సభలో పార్టీలో చేరేది ఎవరు అన్న విషయాలను పీసీసీ నేతలు సీక్రెట్ గా ఉంచుతున్నారు. రాహుల్ గాంధీ సభకు రెండు, మూడు రోజుల ముందు వలస నేతలు వివరాలు తెలిసే అవకాశం ఉందని అంటున్నారు.
రేవంత్ రెడ్డి అనుచరుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్, బీజేపీలోని కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. పాలమూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమంటున్నారు. పార్టీ మారాలని డిసైడ్ అయినందనే ఇటీవల స్థానిక ఎమ్మెల్యేను ఆయన తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితోనూ రేవంత్ చర్చలు జరిపారని తెలుస్తోంది. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కూడా కాంగ్రెస్ గూటికి చేరుతారని అంటున్నారు. మంత్రి సబితతో పట్నం, తీగలకు తీవ్ర విభేదాలు ఉన్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేతకు రేవంత్ రెడ్డి గాలం వేశారని అంటున్నారు. ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు భారీగా ఉండనున్నాయని సమాచారం. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో చర్చలు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది. ఇటీవలే సీఎం జగన్ కు కలిసిన పొంగులేటి.. తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారని చెబుతున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లికి చెందిన ఉస్మానియా ఉద్యమ నేత పిడమర్తి రవితోనూ రేవంత్ రెడ్డి చర్చలు పూర్తయ్యాయని తెలుస్తోంది. టీడీపీలో తుమ్మలతో కలిసి పని చేశారు రేవంత్ రెడ్డి. సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్యను కాకుండా పిడమర్తికి టీఆర్ఎస్ టికెట్ వచ్చే ఛాన్స్ లేదు. దీంతో పిడమర్తి పార్టీ మారాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు.
కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతలను తిరిగి కొంత గూటికి తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. కుత్బుల్లాపుర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ను తిరిగి సొంత గూటికి రానున్నారని తెలుస్తోంది. వీళ్లిద్దరికి రేవంత్ రెడ్డితో మంచి సంంబధాలు ఉన్నాయి. చూడాలి మరీ రాహుల్ గాంధీ సిరిసిల్ల సభలో రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారో...
Read Also: Badrachalam Flood: భద్రాచలంలో క్షణక్షణం.. భయంభయం... 72 అడుగులకు చేరువలో నీటిమట్టం! జల ప్రళయమేనా?
Read Also: Teenager Raped: టీనేజ్ బాలికపై రేప్.. నిందితుడికి సహకరించిన భార్య.. సెల్‌ఫోన్‌లో వీడియో తీసి..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.