ఆ విషయంలో కేసీఆర్‌ను ఎలా నమ్మేది... సూటిగా ప్రశ్నించిన రేవంత్ రెడ్డి...
Revanth Reddy on CM KCR: రైతు ఉద్యమంలో చనిపోయిన 750 మంది రైతులకు రూ.3 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్... పంజాబ్ రైతులకు ఆర్థిక సాయం చేస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు.
Revanth Reddy on CM KCR: తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందించని సీఎం కేసీఆర్... పంజాబ్‌లో చనిపోయిన రైతులకు పరిహారం ఇస్తామంటే ఎలా నమ్మాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైనవారి కుటుంబాలను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ఇస్తామన్న వరద పరిహారం ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం టీఆర్ఎస్ (TRS) పాలనలో 7,500 మంది రైతులు మృతి చెందారని... బాధిత రైతు కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. గతంలో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. అలాంటిది పంజాబ్‌లో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.3 లక్షలు ఇస్తామంటే ఎలా నమ్మేదని ప్రశ్నించారు.
యాసంగి వరి ధాన్యం కొనుగోలు (Paddy Procurement) విషయంలో కేంద్రంతో అమీ తుమీ తేల్చుకునేందుకు చివరిప్రయత్నంగా ఢిల్లీకి వెళ్లనున్నట్లు సీఎం కేసీఆర్ శనివారం (నవంబర్ 20) ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సాగు చట్టాల ఉపసంహరణపై కేసీఆర్ మాట్లాడారు. ఇది రైతులు సాధించిన అద్భుత విజయమని వారిని అభినందించారు. ఈ పోరాటంలో మరణించిన 750 మంది రైతుల కుటుంబాలకు రూ.3లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో చనిపోయిన రైతులను (Farmers) పట్టించుకోని కేసీఆర్... పంజాబ్ రైతులకు పరిహారం ఇస్తామని చెప్పడం నమ్మశక్యంగా లేదంటున్నారు.
Also Read: తెలంగాణలో విషాదం..కాల్వలోకి దూకి తల్లీకూతురు ఆత్మహత్య
శనివారం నాటి ప్రెస్ మీట్‌లో రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కేసీఆర్ (CM KCR) కేంద్రాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర నిమిత్తం చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాటా తేల్చేందుకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో పాటు విద్యుత్ చట్టం రద్దు, బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ డిమాండ్లను ఢిల్లీ పర్యటనలో కేంద్రం ముందు ఉంచనున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు సంబంధిత మంత్రులు, అధికారుల బృందం ఢిల్లీ వెళ్లనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook