Yadadri: యాదాద్రి ఆలయానికి రేవంత్ రెడ్డి శుభవార్త.. టీటీడీ తరహాలో బోర్డు ఏర్పాటుకు నిర్ణయం
Revanth Reddy Orders To Form A Board Like TTD In Yadadri:తన జన్మదినం సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తరహాలో యాదాద్రికి కూడా పాలకమండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Yadadri Temple: గత ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని పునఃర్నిర్మాణం చేసి తెలంగాణకు అద్భుతమైన ఆలయాన్ని అందించగా.. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలో పయనిస్తున్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధికి తెలంగాణ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదాద్రికి ఆలయ పాలకమండలి నియమించాలని నిర్ణయించారు. ఆలయ అభివృద్ధిపై అధికారులతో చర్చలు జరిపారు.
Also Read: KT Rama Rao: జైలుకు పోతా.. బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా: కేటీఆర్ సంచలన ప్రకటన
తన జన్మదినం సందర్భంగా రేవంత్ రెడ్డి బుధవారం యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం యాదాద్రి అధికారులతోపాటు దేవాదాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 'యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలి' అని ఆదేశించారు.
Also Read: HBD Revanth Reddy: పుట్టినరోజు రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇదే! ఎక్కడ సంబరాలు తెలుసా?
'టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యం ఉండేలా పూర్తి అధ్యయనంతో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలి. గోశాలలో గోసంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీని తీసుకురావాలి. గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. కొండపై భక్తులు నిద్రించి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలి' అని రేవంత్ రెడ్డి సూచించారు. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలన్నారు.
'బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలి. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలి. దీనికి అవసరమైన నిధులను మంజూరు చేయాలి' అని ముఖ్యమంత్రి కోరారు. ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. వారం రోజుల్లో పూర్తి వివరాలు, సూచనలతో రావాలని చెప్పారు. ఆలయానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇకనుంచి యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి