Revanth Reddy's Reply to Minister KTR's Notices: హైదరాబాద్: మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా పేరుతో పంపించిన లీగల్ నోటీసులకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. లీగల్ నోటీసులో పలు అంశాలను ప్రస్తావిస్తూ వాటికి బదులుగా రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. లీగల్ నోటీసులను తిరిగి వెనక్కి తీసుకోకపోతే తానే మంత్రి కేటీఆర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయ పోరాటం చేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కేంద్రంగా జరిగిందన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఉద్యమం సాగిన సమయంలో మంత్రి కేటీఆర్ ఈ దేశంలోనే లేనందున ఆయనకు ఆ బాధ తెలియదు అని అన్నారు. అంతేకాకుండా అసలు తెలంగాణ ఉద్యమంతో మంత్రి కేటీఆర్ కు సంబంధమే లేదు అని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు విషయం అనేది లక్షలాది మంది నిరుద్యోగులకు సంబంధించిన అంశం కనుక తాను ఆ నిరుద్యోగుల తరపునే మాట్లాడా అని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. టీఎస్పీఎస్సీ విభాగం సర్వర్ల నిర్వహణతో పాటు వారికి అసరమైన సాంకేతిక పరిజ్ఞానం మొత్తం ఐటీ శాఖ అందిస్తోంది. అలాంటప్పుడు ఐటి శాఖ మంత్రిగా కల్వకుంట్ల తారక రామారావు తనకు సంబంధం లేదని ఎలా చెబుతాడు అని రేవంత్ రెడ్డి నిలదీశారు. ఇదే కాకుండా టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్ రెడ్డి నియామకం కూడా ఐటీ శాఖ ద్వారానే జరిగింది అనే విషయం మర్చిపోకూడదు అని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. 


ఇది కూడా చదవండి : Minister KTR Latter: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు తెలుగులోనూ అవకాశం కల్పించండి.. అమిత్‌ షాకు కేటీఆర్ లేఖ


ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఏఇ ఉద్యోగాల రిక్రూట్మెంట్ పరీక్షకు సంబంధించి ప్రశ్న పత్రం లీక్ అయిందనే కేసులో ప్రతిపక్ష నేతలైన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వేర్వేరుగా చేసిన అనేక ప్రకటనల్లో మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మంత్రి కేటీఆర్ పీఏ పరిసర గ్రామాల నుంచి టిఎస్పీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థుల ఎంపికపైనా రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆరోపణలు చేశారు.


టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ మంత్రి కేటీఆర్ సమక్షంలోనే జరిగిందని.. అందుకే ఈ తప్పిదానికే ఆయనే బాధ్యత వహించాలి అంటూ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు బండి సంజయ్ కుమార్ సైతం ఇదే విషయంలో మంత్రి కేటీఆర్‌పై వేలెత్తి చూపిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ ప్రతిపక్ష నేతలైన రేవంత్ రెడ్డికి, బండి సంజయ్‌ కుమార్లపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానంటూ లీగల్ నోటీసులు జారీచేశారు. 


ఇది కూడా చదవండి : Telangana Politics: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్.. కాంగ్రెస్‌కు వచ్చేది ఎన్ని సీట్లంటే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK