Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విస్తృత ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో మానవత్వం చాటుకున్నారు. ప్రమాదానికి గురయిన వ్యక్తికి తన కాన్వాయ్‌లోని అంబులెన్స్‌ను పంపించి ప్రాణాలు కాపాడారు. దగ్గరుండి ఆ వ్యక్తిని ఆ అంబులెన్స్‌కు పంపించి వెంటనే వైద్య సహాయం అందించేలా చూశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Amit Shah: రేవంత్‌ రెడ్డిపై అమిత్‌ షా ఫైర్‌.. తెలంగాణను ఢిల్లీకి ఏటీఎమ్‌ చేశారని తీవ్ర వ్యాఖ్యలు


 


ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని రాజేంద్రనగర్‌లో గురువారం రేవంత్‌ రెడ్డి పర్యటించారు. రోడ్‌ షో అనంతరం అత్తాపూర్‌లో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు. ఎంపీ అభ్యర్థి రంజిత్‌ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. ఓపెన్‌ టాప్‌పై నిలబడి మాట్లాడుతుండగా కింద ఉన్న కార్యకర్తల్లో అలజడి మొదలైంది. ఇది గమనించిన రేవంత్‌ రెడ్డి వెంటనే ఆరా తీశారు. ఏం జరిగిందని అడిగి తెలుసుకున్నారు.

Also Read: KCR Live: రేవంత్ రెడ్డికి చేతకాకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నేనే రిపేర్‌ చేస్తా: కేసీఆర్


 


ఒకరు స్పృహ తప్పి పడిపోయినట్లు గమనించారు. వెంటనే తన వద్ద ఉన్న నీటి సీసాను కిందకు విసిరేశారు. అనంతరం తన కాన్వాయ్‌లోని అంబులెన్స్‌ వద్దకు పంపించాలని సూచించారు. అస్వస్థతకు గురయిన వ్యక్తిని అంబులెన్స్‌లోని వైద్యుడి వద్దకు పంపించాలని చెప్పారు. అతడిని తరలించేందుకు పోలీసులు సహకరించాలని ఆదేశించారు. ఏం చేస్తున్నార్రయ్యా పోలీసులు అని కొంత ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అంబులెన్స్‌లోకి తీసుకెళ్లారు. ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. అతడిని కాపాడడంతో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు కేకలు వేశారు.


అనంతరం జరిగిన ప్రసంగంలో రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ముస్లిం రిజర్వేషన్ల రద్దు ప్రకటనపై స్పందించారు. '70 ఏళ్లుగా అమలులో ఉన్న రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ పంతంతో ఉంది. పార్లమెంట్‌లో మెజార్టీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ అజెండా. ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలు, అజెండానే మోదీ సర్కారు అమలు చేస్తోంది' అని విమర్శించారు. తమకు అధికారం కొత్త కాదని పేర్కొన్నారు.పేదల కోసం కాంగ్రెస్‌ పార్టీ పని చేస్తోందని చెప్పారు. 'కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజిపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ కారిడార్‌ను ప్రధాని మోదీ అడ్డుకున్నారు' అని ఆరోపించారు.


'రైతుల ఆదాయం పెంచుతామన్న మోదీ ప్రభుత్వం రైతుల ఖర్చులు పెంచారు. నల్లచట్టాలు తెచ్చి 3 వేల మంది రైతుల ప్రాణాలు బలిగొన్నారు' అని రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాగా అంతకుముందు ఉదయం పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో పదేళ్ల ఎన్డీయే పాలనపై 'నయవంచన' పేరుతో చార్జ్‌షీట్‌ విడుదల చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter