Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఓడిస్తే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. నిన్న భువనగిరి సభలో ఉచిత బస్సు పథకం ఆగిపోతుందని పేర్కొన్న రేవంత్‌.. నేడు ఆదిలాబాద్‌ సభలో 'ఇందిరమ్మ ఇండ్లు ఆగిపోతాయి' అని మరో హెచ్చరిక జారీ చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించకపోతే జరిగే పరిణామాలను వివరించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Harish Rao: రేవంత్‌ రెడ్డికి ఏడుపాయల దుర్గమ్మ ఉసురు తగులుతుంది: హరీశ్‌ రావు


లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జరిగిన ఆదిలాబాద్ జన జాతర సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 'ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేసుకుంటున్నాం. త్వరలోనే రూ.2 లక్షల రుణమాఫీ చేసుకోబోతున్నాం' అని తెలిపారు. రాంజీ గోండు, కొమురం భీమ్ ఈ గడ్డ పౌరుషాన్ని నిరూపించారని తెలిపారు. ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా ఆ కుటుంబాలను ఆదుకుని, స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుకుంటున్నామని చెప్పారు. నాగోబా జాతరకు కోట్ల రూపాయలు కేటాయించి ఆదివాసీ సంప్రదాయాన్ని గౌరవించుకుంటున్నామని వివరించారు.

Also Read: Harish Vs Revanth: కొడంగల్‌లో ఓడితే రేవంత్‌ రెడ్డి ఎందుకు సన్యాసం తీసుకోలే? హరీశ్‌ రావు


 


'కుఫ్టీ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది. కడెం ప్రాజెక్టును మరమమ్మతులు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి.. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టును కడతాం. ఆ ప్రాజెక్టుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడతాం' అని రేవంత్‌ రెడ్డి హామీలు ఇచ్చారు. ఆదిలాబాద్‌లో విశ్వవిద్యాలయం ప్రారంభించి స్థానికంగా చదువుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. మూతపడిన సిమెంటు ఫ్యాక్టరీని మళ్లీ తెరిపించి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని ప్రకటించారు.


'మహిళలకు ఉచిత బస్సుతో, పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించాం. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చాం' అని రేవంత్‌ రెడ్డి వివరించారు. అన్ని చేస్తుంటే.. కాంగ్రెస్‌ను ఓడించాలని అక్కడ మోడీ.. ఇక్కడ కేసీఆర్ అంటున్నారు అని గుర్తుచేశారు. ఇందిరమ్మ ఇండ్లను డబ్బా ఇండ్లు అని చెప్పి.. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు.


'కాంగ్రెస్‌ను పడగొట్టినా.. ఓడగొట్టినా... ఇందిరమ్మ ఇండ్లు ఆగిపోతాయి' అని రేవంత్‌ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. గ్యారంటీలు అమలు చేస్తున్న కాంగ్రెస్‌పై మోదీ, కేసీఆర్ కక్షగట్టి ఓడించాలని చూస్తున్నారని తెలిపారు. వందరోజుల ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారు.. మరి పదేండ్లు ఉన్న వాళ్లని నడి బజార్లో ఉరి తీయాలా? అని ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్ తొడుదొంగలు అని విమర్శించారు.


డిసెంబర్‌లో కేసీఆర్‌ను బండకేసి కొట్టారు.. రేపు మోడీని కూడా గోడకేసి కొట్టాలి అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. పదేళ్లు కేసీఆర్‌ను చూశారు.. పదేళ్లు మోదీని చూశారు.. మీ సంక్షేమం కోరే ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించండి అని విజ్ఞప్తి చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter