Revanth Reddy writes to PM Modi: తెలంగాణలో ధాన్యం పంచాయితీ ఒడవడం లేదు. వడ్లకొనుగోలు కోసం టీఆర్ఎస్ సర్కార్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినా.... రారైస్ కొంటామని కేంద్రం స్పష్టంచేసినా.. ఈ అంశాన్ని ఇంతటితో వదిలేది లేదంటోంది కాంగ్రెస్ పార్టీ. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ముందునుంచీ చెబుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఏకంగా సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై పీఎం మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, సీబీఐ డైరక్టర్లకు లేఖ రాశారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధాన్యంసేకరణలో లేవనెత్తిన సందేహాలను ఈ లేఖలో ప్రస్తావించారు. తెలంగాణలో రైస్ మిల్లర్లు ఎఫ్సీఐ నుంచి ధాన్యం సేకరించి బియ్యం ఇవ్వలేదన్నారు. ఈ విషయం ప్రభుత్వానికి తెలిసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన బియ్యాన్ని మిల్లర్లు నల్లబజారుకు తరలించారా.. లేక విదేశాలకు అమ్ముకున్నారా అని రేవంత్ ప్రశ్నించారు.  


దీంతోపాటు వరేస్తే ఉరే అంటూ గతంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రబీ సమయంలో సీఎం కేసీఆర్ చేసిన గందరగోళం, అనిశ్చితి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. దాదాపు నలభైశాతం మంది రైతులు దోపిడీకి గురయ్యారన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన వైఖరి లేకపోవడం వల్ల రైతులు మిల్లర్లు, దళారులకు ధాన్యం అమ్ముకున్నారన్నారు. దీనివల్ల రైతులకు దాదాపు మూడు నుంచి నాలుగువేల కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారు. రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం భర్తీచేయాలన్నారు.


తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. బాయిల్డ్ రైస్ తీసుకోమని రారైస్ ఎంతైనా తీసుకుంటామని కేంద్రం మొదట్నుంచీ చెబుతూ వచ్చింది. అయితే బాయిల్డ్ రైస్ తీసుకోవాలని కేంద్రంపై టీఆర్ఎస్ విపరీతమైన ఒత్తిడిచేసింది. సీఎం కేసీఆర్ ఈ విషయంపై ఏకంగా ఢిల్లీలో ధర్నా కూడా చేశారు. అయితే కేంద్రం వెనక్కి తగ్గకపోవడంతో చివరకి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసింది. చివరకు రారైస్ ఇస్తామని కేంద్రానికి లేఖ రాసింది. దీనికి కేంద్రంకూడా ఓకే చెప్పింది. ఫలితంగా నెల రోజుల పాటు సాగిన ధ్యాన్యం కొనుగోలు (Paddy procurement) లొల్లి ముగిసింది. అయితే ఇప్పుడు రేవంత్‌రెడ్డి రాసిన లేఖతో ధాన్యం సేకరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.


Also read : Pawan Kalyan visit : తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. జనసేన పార్టీ అధికారిక ప్రకటన


Also read : Telangana Congress Leaders: రాహుల్ గాంధీ టూర్ ఏర్పాట్లలో కాంగ్రెస్ నేతలు బిజీబిజీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook