Revanth Reddy Oath: తెలంగాణ సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం, ఎల్బీ స్డేడియంలో భారీగా ఏర్పాట్లు
Revanth Reddy Oath: తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠ వీడింది. ఇబ్బందులు, అవరోధాలు ఎదురైనా ముందుగా ఊహించినట్టే రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్ధిగా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. రేపు గురువారం ఎల్బీ స్డేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Revanth Reddy Oath: తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాట్లు అడ్డంకుల్ని ఎట్టకేలకు అధిగమించింది. పార్టీలో అంతర్గత సమస్యను దాటుకుని సీఎం అభ్యర్ధిని ఎంచుకుంది. రేపు గురువారం ఎల్బీ స్డేడియంలో తెలంగాణ మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తెలంగాణలో రేపు కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. హైదరాబాద్ లో సీఎల్పీ సమావేశం ఏకవాక్యంతో ముగిసినా సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రియకు రెండ్రోజులు పట్టింది. పార్టీలో సీనియర్ల అభ్యంతరాల నేపధ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడింది. ఎట్టకేలకు అందరితో చర్చించిన తరువాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసి ప్రకటించింది. రేపు అంటే డిసెంబర్ 7వ తేదీ గురువారం ఎల్బీ స్డేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
డిసెంబర్ 7వ తేదీ ఉదయం10 గంటల 28 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రితో పాటు 18 మంది వరకూ మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశాలున్నాయి. ఎల్బీ స్డేడియంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లను జీఐడీతో పాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఇతర సీనియర్లు పర్యవేక్షించారు. గవర్నర్ తమిళ సైకు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన సమాచారం ఇచ్చారు. ఎంతమందిని అనుమతించాలి, ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉండాలనేది చర్చించారు.
అధికారులంతా సమన్వయంతో పనిచేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఛీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఆదేశించారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా బందోబస్తుతో పాటు ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లకు విఘాతం లేకుండా చేయాలని సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా అగ్నిమాపక యంత్రాలు, శకటాలను వేదిక సమీపంలో ఉంచుతున్నారు. ప్రమాణ స్వీకారానికి ఎవరెవరిని ఆహ్వానించేది ఇంకా నిర్ణయించలేదు.
Also read: Tornados in cyclone: రాజమండ్రి సహా పలు ప్రాంతాల్లో విధ్వంసం రేపిన సుడిగాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook