Revanth Reddy Review Power Cut Problems: రాష్ట్రంలో కొనసాగుతున్న అప్రకటిత విద్యుత్‌ కోతలపై ప్రజలు అల్లాడుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. విద్యుత్​ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలను సహించేది లేదని హెచ్చరించారు. అకారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం కలిగిస్తే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: WhatsApp Update: వాట్సాప్‌ యాప్‌లో కీలక మార్పు.. ఇకపై మీరు ఆ పని చేయలేరు


రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యలపై ప్రభుత్వం స్పందించింది. ఇటీవల పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిపేసి అవాంతరం ఎదురైన సంఘటనలపై ముఖ్యమంత్రి విద్యుత్తు శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని తెలిపారు.

Also Read: HCA BMW Offer: హైదరాబాద్‌ క్రికెటర్లకు బంపరాఫర్‌.. రూ.కోటి నగదు, బీఎండబ్ల్యూ కారు


గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు, విద్యుత్తుపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వివరించారు. అటువంటి అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ‌తంతో పోల్చితే విద్యుత్ స‌ర‌ఫ‌రా పెంచినప్పటికీ కోత‌లు పెడుతుండడంపై తప్పుబట్టారు. ఈ దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మీదేనని విద్యుత్తు శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. 


రాష్ట్రంలో డిమాండ్ కు అనుగుణంగా సరిపడేంత విద్యుత్తును అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. విద్యుత్తు అవసరం అధికంగా ఉండే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ పీక్ సీజన్‌కు సరిపడేంత విద్యుత్తును అందించే కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేసుకుందని వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యుత్‌ గణాంకాలను అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరిలో ఒకటో తేదీ నుంచి 13 వరకు రోజుకు 264.95 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా అయిందని తెలిపారు. గతేడాది అదే వ్యవధిలో 242.44 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా జరిగిందని వివరించారు. గతేడాది జనవరిలో 230.54 మిలియన్ యూనిట్లు సరఫరా కాగా, ఈ ఏడాది జనవరిలో అంతకంటే ఎక్కువగా 243.12 మిలియన్ యూనిట్లు సరఫరా అయ్యిందని విద్యుత్‌ అధికారులు వెల్లడించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి