Revanth Reddy`s Open Letter: కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి ఓపెన్ లెటర్.. విషయం ఏంటంటే..
Revanth Reddy`s Open Letter To CM KCR: కామారెడ్డి మునిసిపాలిటీ మాస్టర్ ప్లాన్ విషయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెంటనే స్పందించి రైతుల ఆందోళనలను విరమింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి తన లేఖ ద్వారా డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రాములు కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా కింద కోటి రూపాయల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Revanth Reddy's Open Letter To CM KCR: హైదరాబాద్: టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి బహిరంగ లేఖ రాశారు. కామారెడ్డి మునిసిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాను వెంటనే రద్దు చేసుకోవాలని గత నెల రోజులుగా కామారెడ్డి, అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. కామారెడ్డిలో రైతులు చేస్తున్న ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటిస్తుందని రేవంత్ రెడ్డి తన లేఖ ద్వారా స్పష్టంచేశారు.
అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో పయ్యావుల రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడంపై రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మాస్టర్ ప్లాన్‌లో రైతుల పొలాలను పారిశ్రామిక వాడల కింద గుర్తించడం వల్ల కొద్దిగా భూములు ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయంలో మునిసిపల్, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ పూర్తిగా బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
గ్రామ సభలు పెట్టి స్థానిక రైతులతో చర్చించకుండానే, అధికారులు రైతుల అభిప్రాయం సేకరించకుండానే ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా అమలు చేస్తారు. రైతుల ఉద్యమం నెల రోజులుగా నడుస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం రైతుల పట్ల కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్న చిన్న చూపునకు నిదర్శనం అని అన్నారు. రైతులు తమ డిమాండ్ల సాధన కోసం ప్రాణ సమానమైన భూములను కాపాడుకునేందుకు కలెక్టర్‌తో చర్చించేందుకు వస్తే కలెక్టర్ కనీసం రైతులతో మాట్లాడేందుకు నిరాకరించడం ప్రజల పట్ల ఈ పాలకులకు ఉన్న నియంత ధోరణికి పరాకాష్ట అని పేర్కొన్నారు.
ఈ విషయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెంటనే స్పందించి రైతుల ఆందోళనలను విరమింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి తన లేఖ ద్వారా డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రాములు కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా కింద కోటి రూపాయల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాములు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రైతుల ముందు పెట్టి ప్రజా సభలలో చర్చించి ప్రజల మద్దతుతోనే అమలు చేయాలి. కానీ ప్రభుత్వం అలాంటి పద్ధతిని అవలంభించకుండా పూర్తిగా విఫలమైంది అని రేవంత్ రెడ్డి తన బహిరంగ లేఖ ద్వారా మండిపడ్డారు.
ఇది కూడా చదవండి : Revanth Reddy Slams KCR: 35 వేల కోట్లు దోచిన గజదొంగ కేసీఆర్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
ఇది కూడా చదవండి : Shabbir Ali, Revanth Reddy: పార్టీలో సీనియర్లు , జూనియర్లు పంచాయతీ ఏంది: షబ్బీర్ అలీ
ఇది కూడా చదవండి : Revanth Reddy: కాంగ్రెస్ శిక్షణ తరగతులకు సీనియర్లు డుమ్మా.. హై కమాండ్ సీరియస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook