RGV Murder song: పిల్లల్ని ప్రేమించడం తప్పా..?
తెలంగాణ మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య (Pranay murder) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ప్రేమ, వాస్తవ ఘటన, హత్య, ఆత్మహత్య ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ‘మర్డర్’ (MURDER Movie) ని తెరకెక్కిస్తున్నారు.
RGV Murder movie song: తెలంగాణ మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య ( Pranay murder ) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ప్రేమ, వాస్తవ ఘటన, హత్య, ఆత్మహత్య ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ‘మర్డర్’ ( MURDER Movie ) ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలనే ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ (MURDER Trailer)కూడా విడుదలయింది. Also read: RGV ‘మర్డర్’ మూవీ ట్రైలర్ వచ్చేసింది..
తన కూతురు అమృత కులాంతర ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని తండ్రి మారుతీరావు అల్లుడు ప్రణయ్‌ని హత్య చేయించి.. కొంతకాలం తరువాత మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఎలా ఉండబోతుందో ట్రైలర్‌లో చూపించి అంచనాలను ఒక్కసారిగా పెంచిన వర్మ తాజాగా మర్డర్ పాటను కూడా విడుదల చేశారు. ఈ పాటను ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
పిల్లల్ని ప్రేమించడం తప్పా..? అంటూ సాగే ఈ పాటకు సీరాశ్రీ లిరిక్స్ అందించాగా.. వర్మనే పాడారు. అయితే.. ఈ మర్డర్ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి, భార్గవి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. దీనికి డీఎస్ఆర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఈ నెలలోనే సెన్సార్‌కి వెళుతుందని సమాచారం. ఆ తర్వాత దీనిని థియేటర్లల్లో విడుదల చేస్తామని వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే..