బుల్లితెర నటి శ్రావణి కొండపల్లి ఆత్మహత్య కేసు (TV serial actress Sravani suicide)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రావణి ఆత్మహత్య కేసులో ఇదివరకే ఆమె టిక్ టాక్ లవర్  దేవరాజ్ రెడ్డిని విచారించారు. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్న సాయికృష్ణారెడ్డిని ఎస్సార్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకన్య లాడ్జి దగ్గర దేవరాజ్‌ను శ్రావణి కలుసుకోవడం.. ఆపై సాయి ఎంట్రీ ఇచ్చి ఆమెను ఇంటికెళ్లిపోవడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించడం తెలిసిందే. Actress Sravani Suicide Case: ‘ప్లీజ్ దేవా, నన్ను వదిలేయ్’.. దేవరాజ్‌ను వేడుకున్న నటి శ్రావణి, ఆడియో లీక్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో సాయికృష్ణారెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. అతడు మాత్రం శ్రావణి ఆత్మహత్యకు తాను కారణం కాదని చెబుతున్నాడు. శ్రావణితో పాటు ఆమె కుటుంబసభ్యులకు తాను మద్దతుగా ఉన్నానని పోలీసులకు చెప్పాడు. అయితే గతంలో శ్రావణి, సాయిలు ప్రేమించుకున్నారని.. దేవరాజ్ ఎంట్రీతో సీన్ రివర్స్ అయిందని మరో కథనం వెలుగులోకి వచ్చింది. దేవరాజ్‌రెడ్డిని విచారించిన పోలీసులు అతడి వద్ద కొన్ని వీడియోలు, ఫోన్ కాల్ రికార్డింగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సాయిని విచారిస్తున్న పోలీసులు త్వరలోనే సినీ నిర్మాత అశోక్ రెడ్డిని విచారించే అవకాశాలున్నాయి. Sravani Suicide Case: లొంగిపోయిన దేవరాజ్.. టాలీవుడ్ నిర్మాతను విచారించనున్న పోలీసులు 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR