వరంగల్: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా జరిపే గిరిజన జాతరకు మన దేశంలోనే కాకుండా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరున్న సంగతి తెలిసిందే. ఒక ఏడాది తప్పించి మరో ఏడాది ఘనంగా జరుపుకునే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగునే ఉన్న మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, ఒడిషా, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఆరంభంలో జరగనునన్న మేడారం జాతరకు తేదీలను ఖరారు చేసినట్టు అక్కడి పూజారుల సంఘం ప్రకటించింది. 


పూజారుల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 5న సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెలకు చేరుకోనుండగా... ఫిబ్రవరి 6న సమ్మక్క తల్లి గద్దెకు చేరుకోనుంది. ఫిబ్రవరి 7న భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు. ఫిబ్రవరి 8న సమ్మక్క-సారలమ్మ తిరిగి వన ప్రవేశం జరగనుంది.