Saroor Nagar Honour Killing: సంచలనంగా మారిన సరూర్ నగర్ పరువు హత్య కేసుపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. నాగరాజు హత్యను ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఆశ్రిన్ సుల్తానా తన ఇష్టపూర్వకంగానే నాగరాజును పెళ్లి చేసుకుందని... అది సరైందేనని అన్నారు. సుల్తాన్ సోదరుడు ఆమె భర్తను హత్య చేయడం క్రూరమైన చర్య అని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారమైనా, ఇస్లాం ప్రకారమైనా... ఇది నేరపూరిత చర్య అన్నారు. హైదరాబాద్ దారుస్సలాంలో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సరూర్ నగర్ హత్య ఘటనకు వేరే రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా బీజేపీ నేతలను ఉద్దేశించి ఒవైసీ కామెంట్స్ చేశారు. హత్య ఘటనలో నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారని... తాము హంతకుల పక్షాన నిలబడేవాళ్లం కాదని అన్నారు. 


అసదుద్దీన్ ఒవైసీని నిలదీసిన బీజేపీ :


దేశంలో ఎక్కడ ముస్లింలపై దాడులు జరిగినా స్పందించే ఒవైసీ... సరూర్ నగర్ ఘటనపై మాత్రం ఎందుకు స్పందించట్లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఒవైసీ స్పందించకపోవడం హత్యకు మద్దతునిచ్చినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హత్య ఘటనను ఖండిస్తూ ఒవైసీ స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మతాంతర వివాహం వల్లే నాగరాజును హత్య చేశారని బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో... హత్యకు వేరే రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని ఒవైసీ పరోక్షంగా వ్యాఖ్యానించారు.


నివేదిక కోరిన గవర్నర్ :


సరూర్ నగర్‌లో బిల్లపురం నాగరాజు పరువు హత్యపై గవర్నర్ తమిళిసౌ సౌందరరాజన్ ప్రభుత్వాన్ని నివేదిక కోరారు. జాతీయ ఎస్సీ కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్, డీజీపీ, హైదరాబాద్ సీపీ, హైదరాబాద్ కలెక్టర్లకు నోటీసలు జారీ చేసింది.


హత్య జరిగిందిలా : 


రంగారెడ్డి జిల్లాకు చెందిన బిల్లపురం నాగరాజు, సయ్యద్ అశ్రిన్ సుల్తానా ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌ పాతబస్తీలోని ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి సుల్తానా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. పెళ్లి తర్వాత ఈ జంటను సుల్తానా కుటుంబం పలుమార్లు వెంటాడింది. ఈ క్రమంలో కొన్నాళ్లు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లిపోయారు. ఇటీవలే తిరిగి హైదరాబాద్‌కు వచ్చి సరూర్‌నగర్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం (మే 4) బైక్‌పై ఇంటి నుంచి బయటకెళ్లిన జంటపై సుల్తానా సోదరుడు, అతని స్నేహితుడు కలిసి దాడి చేశారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే గడ్డపారాలతో నాగరాజుపై దాడి చేసి హత్య చేశారు.


Also Read: Revanth Reddy: రాహుల్ నోట.. రేవంత్ మాట.. ఫైర్ బ్రాండ్ లీడర్ కు ఇక తిరుగే లేదా!  


Also Read: రాశి ఫలాలు... ఆ రాశి వారికి వివాహ విషయంలో కీలక సూచన...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.