Horoscope Today May 7 2022: రాశి ఫలాలు... ఆ రాశి వారికి వివాహ విషయంలో కీలక సూచన...

Horoscope Today  May 7 2022:  నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారికి పూర్తిగా సానుకూల సమయం.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 7, 2022, 07:24 AM IST
  • నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి బాగా కలిసొస్తుంది
  • కొన్ని రాశుల వారికి ఉద్యోగ రీత్యా ప్రమోషన్ దక్కవచ్చు
  • నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయంటే..
 Horoscope Today May 7 2022: రాశి ఫలాలు... ఆ రాశి వారికి వివాహ విషయంలో కీలక సూచన...

Horoscope Today May 7 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారు కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వివాహ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. జీవిత భాగస్వామితో లేని విభేదాలు కొని తెచ్చుకోవద్దు. నేటి రాశి ఫలాల్లో ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి... 

మేషరాశి ( Aries)

వ్యాపార రంగంలో ఉన్నవారు విశేషంగా రాణిస్తారు. వ్యాపార భాగస్వామి సహాయంతో బిజినెస్‌లో కొత్త ప్లాన్స్ విజయవంతంగా అమలుచేస్తారు. సోషల్ లేదా ఫ్యామిలీ గెట్ టు గెదర్‌లో పాల్గొంటారు. అది మీ నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేస్తుంది. వ్యాపార రీత్యా వేరే ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. భవిష్యత్తులో అది మీకు ప్రయోజనకరంగా మారుతుంది. 

వృషభ రాశి (Taurus)

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొంతమంది, తమ శక్తికి మించి మీకు సాయం చేస్తామని మాటిస్తారు. కానీ అవి మాటలే తప్ప చేతల్లో అంతా శూన్యం అని గుర్తించండి. మీ ప్రియురాలు, ప్రియుడు లేదా జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తవచ్చును. వారికి మీరు ఎంత నచ్చజెప్పాలని చూసినా లాభం లేకపోవచ్చు. దాంతో ఒత్తిడికి లోనవుతారు. మానసిక ప్రశాంతత కరువుతుంది. 

మిథున రాశి (GEMINI)

తోబుట్టువులు, బంధువులకు సంబంధించిన అంశాల్లో బిజీగా గడుపుతారు. తోబుట్టువుల సహాయంతో కొత్త వెంచర్స్ ప్రారంభిస్తారు. ప్రారంభించిన వెంటనే మీకొక పెద్ద ఆర్డర్ లభిస్తుంది. అది మీ ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది. వ్యాపారం నెమ్మదిగా పుంజుకుని లాభాలు తీసుకొస్తుంది. 

కర్కాటక రాశి (Cancer) 

ఇవాళ మీకు అంతగా కలిసిరాదు. నెగటివ్ ఆలోచనలు వెంటాడుతాయి. సహనం కోల్పోతారు. మీ అహంకారం మిమ్మల్ని క్లిష్ట పరిస్థితుల్లో మరింత ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. జీవితం ఇక ఎక్కడో ఒకచోట ఆగిపోతుందేమోనన్న భావన కలుగుతుంది. పెద్దల ఆశీస్సులు తీసుకుంటే ఈ కష్టాలన్నీ గట్టెక్కే అవకాశం ఉంటుంది. 

సింహ రాశి (LEO)

ఈరోజు ప్రారంభంలో కాస్త చికాకుగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేయలేరు. లేదా సరిగా ఫోకస్ చేయలేరు. అయితే మీకున్న ఆత్మవిశ్వాసం మిమ్మల్ని వెనక్కి తగ్గకుండా చేస్తుంది. మెల్లిగా అన్ని సర్దుకుంటాయి. మీకు కావాల్సిన వనరులను మీరే సమకూర్చుకుంటారు. మీ ఆదాయం పెరుగుతుంది. నష్టాలు లాభాలుగామారుతాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.

కన్య రాశి (Virgo)

ఇవాళ మీకు సానుకూల సమయం. మీ కృషిని మీ బాస్ గుర్తిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్ దక్కే అవకాశం ఉంటుంది. ప్రభావశీలురైన వ్యక్తులతో పరిచయం మీ జీవితాన్ని మారుస్తుంది. అది మీకు ప్రపంచాన్ని కొత్తగా పరిచయం చేస్తుంది. మీరంటే సమాజంలో గౌరవం, పలుకుబడి పెరుగుతుంది. మీ నుంచి సాయం ఆశించేవారి సంఖ్య కూడా పెరుగుతుంది. తోచిన మేరకు వీలైనంతమందికి సాయం చేస్తారు.

తులా రాశి (Libra)

పెద్దల ఆశీస్సులు మీకు శుభం కలగజేస్తాయి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయిపోతాయి. జీవితం సంతోషంగా, సాఫీగా సాగుతుంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. విదేశాలకు ప్రయాణించే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలు లేదా స్వచ్చంద సంస్థలకు తోచిన సాయం చేస్తారు. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలు లేదా ఎక్కడికైన టూర్‌కు వెళ్తారు. 

వృశ్చిక రాశి (Scorpio)

వివాహ సంబంధిత విషయాల్లో తొందరపాటు పనికిరాదు. వివాహ విషయాల్లో కుటుంబ సభ్యులను అడిగి నిర్ణయం తీసుకోండి. పెళ్లయినవారు జీవిత భాగస్వామి పట్ల తమ అహంకారాన్ని ప్రదర్శించవద్దు. అది వైవాహిక జీవితంలో ఆటుపోట్లకు దారితీస్తుంది. మీ జీవితభాగస్వామి మీకు దూరమయ్యే ప్రమాదాన్ని కల్పిస్తుంది. పెద్దల ఆరోగ్యం పట్ల కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టండి. 

ధనుస్సు రాశి (Sagittarius)  

ఇవాళంతా నెగిటివిటీ వెంటాడుతుంది. ఆలోచనలు అదుపులో ఉండవు. చేపట్టిన పనులు పూర్తికావు. ఎక్కడికెళ్లినా ఛీత్కారాలు ఉంటాయి. ఏం చేయాలో తోచదు. గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. తెలియని భయంలో మీకు మీరే కుంగిపోతారు. సన్నిహితుల సలహాలు, సూచనలతో ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంది. 

మకర రాశి (Capricorn) 

మీ జీవిత భాగస్వామితో విలువైన సమయం గడుపుతారు. జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా ప్రయాణిస్తారు. ఇద్దరు కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లే అవకాశం ఉంటుంది. సంతాన రీత్యా శుభవార్త ఉండొచ్చు. కొత్త జంటలకు పూర్తిగా సానుకూల సమయం. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇల్లు కారు లేదా ఇతర వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభ రాశి (Aquarius)

ఇవాళ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుస్తుంది. ఎనర్జిటిక్‌గా కనిపిస్తారు. చేపట్టిన ప్రతీ పనిని సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తిపరమైన, కుటుంబపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మిమ్మల్ని అడ్డుకోవాలని చూసే ప్రత్యర్థులు పక్కకు తప్పుకుంటారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. డబ్బుకు లోటు ఉండదు.

మీన రాశి (Pisces) 

ఇవాళ మీలో ఉత్సాహం పీక్స్‌లో ఉంటుంది. పెట్టుబడులు పెట్టే ముందు వాస్తవాలను పరిశీలించండి. ఊహజనిత ప్రపంచంలో విహరించడం మానుకోండి. మీ మాటతో చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. కెరీర్ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి. మిమ్మల్ని మీరు విశ్లేషించుకుని మరింత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంటారు. 

Also Read: Sarkaru Vaari Paata Pre-release Event: సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్.. వాహనదారులకు ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల

Also Read: Warangal Declaration: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 2 లక్షలు రుణమాఫీ చేస్తాం : రేవంత్ రెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News