హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు (SC, ST act POA 1989 ) నమోదైంది. యాచారం ఎంపీపీ సుకన్య చేసిన ఫిర్యాదు మేరకు యాచారం పోలీసులు ఎమ్మెల్యే కిషన్ రెడ్డిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. యాచారం మండలం నందివనపర్తిలో గురువారం ఫార్మాసిటీ రోడ్డు విస్తరణ భూమిపూజ కార్యక్రమం జరిగింది. రూ.77 కోట్లతో యాచారం– మీరాఖాన్‌పేట, నందివనపర్తి– నక్కర్తమేడిపల్లి గ్రామాల మధ్యన చేపట్టే ఈ అభివృద్ధి పనులకు భూమిపూజ జరిపేందుకు స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే భూమిపూజ చేస్తున్న తరుణంలోనే అక్కడకు చేరుకున్న స్థానిక ఎంపీపీ సుకన్య.. ప్రోటోకాల్ ప్రకారం తనకు అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వలేదని పనులను అడ్డుకోబోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీపీ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరడంతో మధ్యలో కలగజేసుకున్న పోలీసులు ఎంపీపీ సుకన్యను అక్కడి నుంచి పక్కకు తప్పించారు. రానున్న 10 రోజుల్లో 2600 ప్రత్యేక రైళ్లు)
 
అయితే, తాను దళిత ఎంపీపీని అయినందువల్లే తనను దూషిస్తూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తనపట్ల దురుసుగా ప్రవర్తించారంటూ సుకన్య యాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కిషన్ రెడ్డితో పాటు ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరి రెడ్డి, సీఐ గురువా రెడ్డిలపైనా ఆమె ఎస్సీ/ఎస్టీ యాక్టు కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీపీ సుకన్య ఫిర్యాదు మేరకు IPC 509 SEC 3(1)(r) SC,ST POA ACT 2015, 323 IPC సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. 
 Shramik trains : ఒక రాష్ట్రానికి వెళ్లాల్సిన రైలు మరో రాష్ట్రానికి.. అయోమయంలో ప్రయాణికులు! )


ఇదిలావుంటే మరో ఘటనలో మలక్‌పేట్‌ ఎమ్మెల్యే బలాలపై చాదర్​ ఘాట్ పోలీసులు ఎస్సీ / ఎస్టీ ఎట్రాసిటీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే బలాలా ఇటీవల తనను కులం పేరుతో దూషించారంటూ కేంద్ర మాజీ మంత్రి బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతి చేసిన ఫిర్యాదు మేరకే ఛాదర్‌ఘాట్ పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్టు సమాచారం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..