రానున్న 10 రోజుల్లో 2600 ప్రత్యేక రైళ్లు

వలసకూలీలకు ( Migrant workers ) ఇండియన్ రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకూలీలను శ్రామిక్ స్పెషల్ ట్రెయిన్స్ ( shramik special trains ) ద్వారా వారి స్వస్థలాలకు చేరవేయడంలో నిరంతరంగా సేవలు అందిస్తున్న ఇండియన్ రైల్వే ( Indian Railways ).. తాజాగా మరో ప్రకటన చేసింది.

Last Updated : May 24, 2020, 12:15 AM IST
రానున్న 10 రోజుల్లో 2600 ప్రత్యేక రైళ్లు

న్యూఢిల్లీ: వలసకూలీలకు ( Migrant workers ) ఇండియన్ రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే లాక్‌డౌన్ కారణంగా అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకూలీలను శ్రామిక్ స్పెషల్ ట్రెయిన్స్ ( shramik special trains ) ద్వారా వారి స్వస్థలాలకు చేరవేయడంలో నిరంతరంగా సేవలు అందిస్తున్న ఇండియన్ రైల్వే ( Indian Railways ).. తాజాగా మరో ప్రకటన చేసింది. రానున్న 10 రోజుల్లో 2,600 శ్రామిక్ స్పెషల్ ట్రెయిన్స్ నడిపించనున్నట్టు రైల్వే శాఖ స్పష్టంచేసింది. దీంతో శ్రామిక్ ప్రత్యేక రైళ్ల సేవలు నిలిపేస్తారేమోననే అనుమానాలకు రైల్వే శాఖ తెరదించినట్టయింది. దాదాపు 36 లక్షల మంది వలస కార్మికులకు వారి సొంతూళ్లకు వెళ్లిపోవడానికి ఇదో చక్కటి అవకాశం కానుందని రైల్వే భావిస్తోంది. ఈ నెల 1న ప్రారంభమైన శ్రామిక్‌ ప్రత్యేక రైళ్ల ద్వారా ఇప్పటికే భారీ సంఖ్యలో వలసకూలీలు, విద్యార్థులు, పుణ్యక్షేత్రాలకు వెళ్లి లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన భక్తులు, ఇతరులను వారి సొంతూళ్లకు తరలించడంలో రైల్వే శాఖ విజయం సాధించిందని రైల్వే అధికారులు తెలిపారు. Shramik trains : ఒక రాష్ట్రానికి వెళ్లాల్సిన రైలు మరో రాష్ట్రానికి.. అయోమయంలో ప్రయాణికులు! )

వలసకూలీలు తరలింపు విషయంలో సంబంధిత రాష్ట్రా ప్రభుత్వాల విజ్ఞప్తుల మేరకు వారితో కలిసి పనిచేస్తున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే ఒడిషా నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పలు చోట్ల బతుకుదెరువు కోసం వచ్చిన వలసకూలీలను నేడు తెలంగాణ సర్కార్ తమ సొంత ఖర్చులపై ప్రత్యేకంగా ఓ శ్రామిక్ స్పెషల్ ట్రెయిన్ ఏర్పాటు చేసింది. శనివారం రాత్రి ఈ రైలు ఒడిషాకు బయల్దేరినట్టు సమాచారం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News