Rajya Sabha Bypoll In Telangana: తెలంగాణలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్‌ విడుదలయ్యింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈమేరకు నోటిఫికేషన్‌ జారీచేసింది. టీఆర్‌ఎస్‌ నుంచి బండ ప్రకాష్‌ ఇన్నాళ్లు రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. అయితే, ఇటీవలే ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేశారు. దీంతో ఆస్థానం ఖాళీ అయ్యింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికల కమిషన్‌ రాజ్యసభ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ ప్రకటించింది. ఈనెల 12వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది.  19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మరుసటిరోజు నామినేషన్లు స్క్రూటినీ నిర్వహిస్తారు. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఈనెల 23వ తేదీ దాకా గడువు ఉంటుంది. ఈనెల 30వ తేదీన రాజ్యసభ స్థానానికి పోలింగ్‌ జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ చేపడతారు. జూన్‌ 1వ తేదీన ఓట్లు లెక్కిస్తారు.


టీఆర్‌ఎస్‌ నాయకుడు బండ ప్రకాష్‌కు 2018లో కేసీఆర్‌ రాజ్యసభ అవకాశం కల్పించారు. ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన ప్రకాష్‌ పనితీరు నచ్చడంతో గత యేడాది ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎమ్మెల్సీ పదవి కేటాయించడంతో.. రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్న బండ ప్రకాష్‌ గతేడాది డిసెంబర్‌ 4వ తేదీన రాజీనామా చేశారు. దీంతో, ఆ పదవి ఖాళీ అయ్యింది.  అయితే, ఈ స్థానానికి కేసీఆర్‌ ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే టీఆర్‌ఎస్‌లో రాజ్యసభ స్థానంకోసం చాలామంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. కానీ, కేసీఆర్‌ ఎవరికి అవకాశం ఇస్తారన్న దానిపై కనీసం సంకేతాలు కూడా వెలువడలేదు. రాజ్యసభ సభ్యుల స్థానానికే కాదు.. నామినేటెడ్‌ పదవులపైనా చాలామంది ఆశలు పెట్టుకున్నారు. వారందరినీ వడపోసి ఒకే ఒక్క రాజ్యసభ స్థానానికి ఎవరిని ఖరారు చేస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.


ఉన్న ఒక్క స్థానానికి తమకు అవకాశం దక్కుతుందో లేదో అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో మొదటినుంచీ ఉన్నవాళ్లకు, సీనియర్లకు అవకాశం కల్పిస్తారా? లేదంటే అనూహ్యంగా కొత్తపేరు ఏదైనా తెరపైకి తీసుకొస్తారా? అన్న చర్చ కూడా టీఆర్‌ఎస్‌ పార్టీలో నడుస్తోంది.


 


Also Read: IPL 2022 Play Off Chances: చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ అవకాశాలు ఏ మేరకు, సాధ్యమయ్యేనా


Also Read: Prashant Kishor Comments: కొత్తపార్టీ పెట్టడం లేదన్న ప్రశాంత్‌ కిషోర్‌ - కొత్త ప్లానేంటో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.