SCR: దసరా సందర్భంగా సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవే..!
SCR: దసరా సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. సికింద్రాబాద్ నుంచి పలు రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
SCR: దసర పండుగ పురష్కరించుకుని ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. దసరా పండుగ రద్దీ దృష్ట్యా వీటిని ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ నుంచి నాలుగు ప్రత్యేక సర్వీసులను నడపనున్నారు. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా వెల్లడించింది. సికింద్రాబాద్-యశ్వంత్ పూర్, సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు తిరగనున్నాయి.
ఈనెల 28న సికింద్రాబాద్ నుంచి యశ్వంత్ పూర్‌కు రైలు వెళ్లనుంది. 29న యశ్వంత్ పూర్ నుంచి సికింద్రాబాద్ రానుంది. అక్టోబర్ 9న తిరుపతి నుంచి సికింద్రాబాద్ ప్రత్యేక రైలు రాబోతోంది. అక్టోబర్ 10న సికింద్రాబాద్ నుంచి తిరుపతి ప్రత్యేక రైళ్లు వెళ్లనుంది. ఈమేరకు రైల్వే శాఖ తెలిపింది. మరోవైపు దసరా పండుగ సందర్భంగా ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్లను పెంచారు. రద్దీని నివారించేందుకు తాత్కాలికంగా వీటిని పెంచుతున్నట్లు ప్రకటించారు.
కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్ ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20 వరకు పెంచారు. పెరిగిన ధరలు ఇవాళ్టి(సెప్టెంబర్ 26) నుంచి అక్టోబర్ 9 వరకు వర్తించనున్నాయని రైల్వే శాఖ తెలిపింది.
ప్రత్యేక రైళ్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..
* ఈనెల 28న సికింద్రాబాద్ టూ యశ్వంత్ పూర్
* 29న యశ్వంత్‌పూర్ టూ సికింద్రాబాద్
* అక్టోబర్ 9న తిరుపతి టూ సికింద్రాబాద్
* అక్టోబర్ 10న సికింద్రాబాద్ టూ తిరుపతి
మరోవైపు దసరా పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. రెండు రాష్ట్రాల్లో ప్రధాన ప్రాంతాల నుంచి పట్టణాలు, గ్రామాలకు వెళ్లేలా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఇవాళ్టి నుంచి అక్టోబర్ 8 వరకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ప్రయాణికులపై అదనపు ఛార్జీల మోపకుండా..పాత ఛార్జీలే ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చనున్నారు. ఈవిషయాన్ని ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
Also read:Minister KTR: అమెరికా ఎంఐటీలా బాసర ట్రిపుల్ ఐటీని తీర్చిదిద్దుతాం: మంత్రి కేటీఆర్..!
Also read:Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం..మరో రెండు గంటలపాటు బీఅలర్ట్..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook