Cine Workers Strike: పంతాలు, పట్టింపులు వద్దు..సినీ నిర్మాతలు, కార్మికులకు మంత్రి తలసాని పిలుపు..!
Cine Workers Strike: తెలుగు చిత్ర సీమలో సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వేతనాలు పెంచాలంటూ కార్మికులు చేపట్టిన నిరసన రెండోరోజుకు చేరింది.
Cine Workers Strike: తెలుగు చిత్ర సీమలో సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వేతనాలు పెంచాలంటూ కార్మికులు చేపట్టిన నిరసన రెండోరోజుకు చేరింది. దీంతో 25కిపైగా సినిమాల షూటింగ్‌లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. వేతనాలు పెంచే వరకు ఆందోళన విరమించమని ఫిల్మ్ ఛాంబర్ ముందు సినీ కార్మికులు నిరసన కొనసాగిస్తున్నారు. సినిమా షూటింగ్‌లకు హాజరు అయితేనే వేతనాల పెంపుపై చర్చిస్తామని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అంటోంది.
మరోవైపు 15 రోజులపాటు పాత పద్ధతిలోనే కార్మికులకు వేతనాలు ఇవ్వాలని నిర్మాతలకు ఫిల్మ్ ఛాంబర్ సూచిస్తోంది. ఈక్రమంలో రోజు రోజుకు సమస్య జఠిలమవుతోంది. ఈనేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్దకు పంచాయతీ చేరింది. మంత్రి తలసానిని ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు, నిర్మాతల మండలి నేతలు, కార్మిక నేతలు వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈసందర్భంగా సమస్యలను మంత్రి తలసాని దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మంత్రి తలసాని, నిర్మాత సి.కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.
ఇచ్చిన మాటకు తాము కట్టుబడి ఉన్నామని సినీ నిర్మాత సి. కళ్యాణ్ స్పష్టం చేశారు. షూటింగ్‌ల్లో పాల్గొన్న తర్వాతే వేతనాలపై చర్చిస్తామని తేల్చి చెప్పారు. ఇవాళ కూడా షూటింగ్‌లు ప్రారంభం కాలేదని..నిర్మాతలంతా కలిసి ఏం చేయాలో తమకు తెలుసని అన్నారు. అవసరమయితే షూటింగ్‌లు నిరవధికంగా వాయిదా వేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు సి. కళ్యాణ్. పంతాలు, పట్టింపులు వద్దని ఇరు పక్షాలకు సూచించానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
రెండు వైపులా సమస్యలు ఉన్నాయని..వాటిని పరిష్కరించుకోవాలన్నారు. కరోనా పరిస్థితులతో సినీ కార్మికుల వేతనాలు పెరగలేదని తెలిపారు. ఇరువర్గాలు కూర్చుకుని చర్చించుకోవాలన్నారు మంత్రి తలసాని. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. రెండు వర్గాలకు న్యాయం జరిగేలా నిర్ణయం ఉండాలన్నారు.
Also read:Maharashtra Political Crisis: కొనసాగుతున్న 'మహా' డ్రామా..ఏక్‌నాథ్ శిందే వైపు ఎమ్మెల్యేల క్యూ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook