Maharashtra Political Crisis: కొనసాగుతున్న 'మహా' డ్రామా..ఏక్‌నాథ్‌ శిందే వైపు ఎమ్మెల్యేల క్యూ..!

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శివసేన పార్టీ రెండు ముక్కలు అయ్యేలా కనిపిస్తోంది. 'మహా' డ్రామాలో మంత్రి ఏక్‌నాథ్‌ శిందే వైపే ఎమ్మెల్యేలంతా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Written by - Alla Swamy | Last Updated : Jun 23, 2022, 11:43 AM IST
  • మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం
  • శివసేనలో చీలికలు
  • ఏక్‌నాథ్‌ శిందే వైపు ఎమ్మెల్యేలు?
Maharashtra Political Crisis: కొనసాగుతున్న 'మహా' డ్రామా..ఏక్‌నాథ్‌ శిందే వైపు ఎమ్మెల్యేల క్యూ..!

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శివసేన పార్టీ రెండు ముక్కలు అయ్యేలా కనిపిస్తోంది. 'మహా' డ్రామాలో మంత్రి ఏక్‌నాథ్‌ శిందే వైపే ఎమ్మెల్యేలంతా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరంతా శివసేన అధినేత, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబాటు ఎగుర వేశారు. ప్రస్తుతం ఏక్‌నాథ్‌ శిందే వైపు 34 మంది ఎమ్మెల్యే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతు తెలిపినట్లు..వారంతా ముంబై నుంచి గౌహతి వెళ్లినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

తమపై పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం ప్రయోగించకుండా శిందే వర్గీయులు పావులు కదుపుతున్నారు. తమపై చర్యలు తీసుకోకుండా 37 మంది ఎమ్మెల్యేలు 2/3 వంతు మెజార్టీ నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఐతే ఏక్‌నాథ్‌ శిందే శిబిరంలో 36 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని..ఇంకా ఇంకొకరు కావాలని జాతీయ మీడియాల్లో వరుసగా కథనాలు ప్రసారం అవుతున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 

మరోవైపు అసమ్మతి నేతలతో నేడు ఏక్‌ నాథ్‌ శిందే సమావేశకానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతోంది. సమావేశం అనంతరం గవర్నర్‌ను సంప్రదించే అవకాశం ఉందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. రోజురోజుకు తమ శిబిరానికి మద్దతు పెరుగుతోందని తిరుగుబాటు నేత, మంత్రి ఏక్‌నాథ్‌ శిందే తెలిపారు. శివసేనకు ప్రస్తుతం 55 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని..వీరిలో 13 మంది మినహా మిగతా వారంతా తమ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. 

అసలైన శివసేన తమదేనన్నారు ఏక్‌నాథ్‌ శిందే. తాను శివసేన శాసనసభాపక్ష నేతనేనని తేల్చి చెప్పారు. రాజకీయ అనిశ్చితిని తెర దించేందుకు శివసేన, ఎన్సీపీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కాసేపట్లో తన వర్గ ఎమ్మెల్యేలతో సీఎం ఉద్దవ్ ఠాక్రే భేటీ కానున్నారు. ప్రస్తుత పరిణామాలపై చర్చించనున్నారు. సమావేశం తర్వాత సీఎం పదవికి ఠాక్రే రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటు ఎన్సీపీ, కాంగ్రెస్‌ ముఖ్య నేతలు సైతం కాసేపట్లో సమావేశం కానున్నారు. తాజా పరిణామాలపై చర్చించనున్నారు.

Also read:Corona Updates in India: భారత్‌లో కరోనా టెర్రర్..తాజాగా కేసులు ఎన్నంటే..!

Also read:Amma Vodi Scheme in AP: ఈసారి అమ్మ ఒడి పథకంలో కోత తప్పదా..ప్రభుత్వ వాదన ఏంటి..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News