Secunderabad Fire Accident, Fire breaks out in Baggas EV Bike Showroom: సోమవారం రాత్రి సికింద్రాబాద్‌ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూంలో షార్ట్ సర్క్యూట్ కావ‌డంతో.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. షోరూం పైన ఉన్న రూబీ లాడ్జిలోకి మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో ఎనమిది మంది పర్యాటకులు మృతి చెందారు. ఊపిరి ఆడక ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరికొంత మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. రూబీ హోటల్‌లో చిక్కుకున్న వారిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. పూర్తి వివరాల్లోకి వెళితే... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సికింద్రాబాద్‌ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో 'రూబీ లగ్జరీ ప్రైడ్‌' పేరిట అయిదంతస్తుల భవనం ఉంది. సెల్లార్‌, గ్రౌండ్‌ ఫ్లోర్లలో 'బగాస్ ఈవి ప్రైవేట్ లిమిటెడ్' ఎలక్ట్రిక్‌ వాహనాల షోరూం నడుస్తోంది. మిగిలిన నాలుగు అంతస్తుల్లో రూబీ హోటల్‌, లాడ్జి ఉంది. సోమవారం రాత్రి 9.40 గంటల ప్రాంతంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు, వేడికి షోరూంలోని ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీలు పేలాయి. దాంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. వాహనాలకు కూడా మంటలు వ్యాపించడంతో పెద్దఎత్తున ఎగసిపడ్డాయి.


మెట్ల మార్గం ద్వారా పై అంతస్తులకు మంటలు, దట్టమైన పొగ వ్యాపించాయి. అగ్నిమాపక శాఖకు సమాచారం అందడంతో.. రెండు వాహనాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. లాడ్జిలో 23 గదులు ఉండగా.. దాదాపు 25 మంది పర్యాటకులు లోపల ఉన్నారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం, దట్టమైన పొగ కారణంగా ఏం జరుగుతుందో అని అందరూ  భయాందోళనకు గురయ్యారు. పొగ కారణంగా ఊపిరి ఆడక కొందరు స్పృహ తప్పి లాడ్జి గదులలో పడిపోయారు. ఊపిరి ఆడక ఎనమిది మంది పర్యాటకులు చనిపోయారు. మంటలు అంటుకుని నలుగురు, కిందికి దూకి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 


క్షతగాత్రులను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఆరుగురు పురుషులు, మహిళ ఉన్నారు. మృతుల్లో విజయవాడకు చెందిన ఎ హరీశ్‌, చెన్నైకి చెందిన సీతారామన్‌, దిల్లీ నివాసి వీతేంద్ర ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది. ప్ర‌మాద ఘ‌ట‌న తెలియ‌గానే మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ వచ్చి స‌హాయ చర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించారు. 


Also Read: T20 World Cup India Team: టీ20 ప్రపంచ కప్‌కు టీమ్ ఇండియా జట్టు ఇదే


Also Read: Mandha Bheem Reddy: గల్ఫ్ కార్మికుల నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook