Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా!
PM Modi reacts on Secunderabad fire accident. సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
PM Modi reacts on Secunderabad fire accident: సికింద్రాబాద్‌లో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. రూబీ ఎలక్ట్రిక్ వాహనాల షోరూంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ-బైకులు పేలి.. మంటలు, దట్టమైన పొగ వ్యాపించి అదే కాంప్లెక్స్‌లోని లాడ్జిలో వసతి పొందుతున్న ఎనమిది మంది పర్యాటకులు ఊపిరి ఆడక మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో పది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ ఘనలో మరణించిన వాళ్లకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ (ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి) తరపున రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా అగ్ని ప్రమాదంలో గాయపడిన వాళ్లకు రూ. 50వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ట్విటర్‌లో ఓ ట్వీట్ చేసింది.
సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు మూడు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను తెలంగాణ ప్రభుత్వం తరఫున అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గాయపడిన వారిని ఆదుకుంటామని, మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పారు.
Also Read: 'రెబల్ స్టార్' ప్రభాస్‌కు అరుదైన గౌరవం.. తొలి సౌతిండియా స్టార్‌గా..!
Also Read: Sanju Samson - Shami: బీసీసీఐ డ్రామాలాడుతోంది.. ట్రెండింగ్‌లో సంజూ, షమీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook