Security enhancement for MLA Raja Singh: హైదరాబాద్: తెలంగాణ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (T. Raja Singh) కు పోలీసులు భద్రతను పెంచారు. నిఘావర్గాల నుంచి వచ్చిన హెచ్చరికల మేరకు హైదరాబాద్ పోలీసులు (TS Police) అప్రమత్తమయ్యారు. ఈ మేరకు పోలీసులు రాజాసింగ్ ఇంటి దగ్గర భద్రతను పెంచారు. ఇప్పటినుంచి రాజాసింగ్‌కు డీసీపీ స్థాయి అధికారి భద్రతను పర్యవేక్షించనున్నారు. అయితే గతంలో మాదిరిగా టు వీలర్‌పై తిరగవద్దని, ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణించాలని పోలీసులు రాజాసింగ్‌కు సూచించారు. పరిస్థితులు ఇప్పుడు బాగా లేవని జాగ్రత్తగా ఉండాలంటూ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ (Anjani Kumar) సూచించారు. ఈ మేరకు లేఖను అందజేశారు.  Also read: V Movie: వస్తున్నా వచ్చేస్తున్నా.. సాంగ్ రిలీజ్


ఇదిలాఉంటే.. తనకు భద్రత పెంపు విషయంపై రాజాసింగ్ స్పందించారు. తనకు ఎవరినుంచి ప్రాణహాని ఉందో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు రాష్ట్ర హోంమంత్రికి లేఖ రాయనున్నట్లు ఆయన చెప్పారు. అయితే కొద్ది రోజుల క్రితం పట్టుబడిన టెర్రరిస్టుల నుంచి సేకరించిన జాబితాలో రాజాసింగ్ పేరు బయటపడినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు భద్రతను పెంచారు. Apsara Rani: స్విమ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన అప్సర    Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు