Vidyaranya Kamlekar`s death news: సీనియర్ జర్నలిస్ట్ విద్యారణ్య కామ్లేకర్ ఇక లేరు
Vidyaranya Kamlekar`s death news: కామ్లేకర్ మరణం ఆయన కుటుంబ సభ్యులతో పాటు యావత్ పాత్రికేయ రంగాన్ని దిగ్భాంత్రికి గురిచేసింది. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని పలువురు ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. కామ్లేకర్ ఆత్మకు శాంతి కలగాలంటూ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
Vidyaranya Kamlekar's death news: ఆయన పేరులో విద్య ధ్వనిస్తుంది. ఆయన రూపం నిలువెత్తు ఆదర్శాలకు ప్రతిరూపంగా నిలుస్తుంది. జర్నలిజం వృత్తిలో దశాబ్దాలు పాటు పని చేసి కడవరకు తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిగా పేరుగాంచిన విద్యారణ్య కామ్లేకర్ ఇక లేరు. 62 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. జర్నలిజం ఒక వృత్తి కాదు.. బాధ్యతగా భావించే వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు విద్యారణ్య కామ్లేకర్. తానో జర్నలిస్ట్ అని ఆయన ఎప్పుడూ గర్వంగా చెప్పుకునే వారంటారు కామ్లేకర్‌కు సన్నిహితంగా ఉండే వారు. తుదవరకు జర్నలిస్టుగానే ఉండాలని ఆయన భావించేవారట. ఆంధ్రపత్రిక లాంటి ప్రతిష్టాతక వార్తాసంస్థల్లో కామ్లేకర్ పని చేశారు. ప్రస్తుతం సకాల్ అనే హిందీ పత్రికలో పని చేస్తున్నారు. 62 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచి అభిమానులను శోక సముద్రంలో ముంచారు.
కామ్లేకర్ మరణం ఆయన కుటుంబ సభ్యులతో పాటు యావత్ పాత్రికేయ రంగాన్ని దిగ్భాంత్రికి గురిచేసింది. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని పలువురు ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. కామ్లేకర్ ఆత్మకు శాంతి కలగాలంటూ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కామ్లేకర్ 1960లో జన్మించారు. తొలినాళ్లలో పాత్రికేయ వృత్తిలో తన అనుభవాలను గుర్తు చేసుకుంటూ అప్పుడప్పుడూ ఆయన సోషల్ మీడియాలో స్నేహితులతో పంచుకునే వారు. అలా అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్‌తో తాను కరచాలనం చేస్తున్న ఫోటో ఒకటి కామ్లేకర్ గతంలో పంచుకున్న విషయాన్ని ఇప్పుడు చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. కామ్లేకర్ మంచి పుస్తక ప్రియలు కూడా. తానో పుస్తకాన్ని కొన్నాననీ.. దాని చదవడం చాలా ఆసక్తికరంగా ఉందంటూ ఆయన చివరిసారిగా పోస్టు చేయడం చాలా మందిని కన్నీళ్లు పెట్టిస్తోంది.
Also read : Komatireddy Rajagopal Reddy: పార్టీ మార్పు..? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Also read : Inter Exams 2022: ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పు.. ఏ ఎగ్జామ్ ఎప్పుడో తెలుసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook