undavalli Meet to kcr: జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ చేసిన సీఎం కేసీఆర్..పలువురి నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ప్రగతి భవన్‌ వేదికగా వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఓ వైపు రాజకీయ వ్యూహా కర్త ప్రశాంత్ కిషోర్‌తో చర్చలు జరుగుతుండగానే..తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. జాతీయ రాజకీయాలపై చర్చిస్తున్నారు. ఈక్రమంలో సీఎం కేసీఆర్‌తో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ భేటీ అయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇరువురి భేటీపై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయబోతున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈభేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. భారత్ రాష్ట్రీయ సమితి ఏర్పాటు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈనెలాఖరులో కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కార్తు గుర్తునే కేటాయించాలని కోరుతున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి.


జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం, రాష్ట్రపతి ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు, తాజా రాజకీయ పరిణామాలపై సీఎం కేసీఆర్ వరుసగా మంతనాలు జరుపుతున్నారు. ఈనెల 19న కీలక ప్రకటన ఉండే అవకాశం ఉంది. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు చేసినా..సీఎంగా కొనసాగుతూ కీలకంగా వ్యవహరిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఢిల్లీ మాదిరిగానే హైదరాబాద్‌ సైతం జాతీయ రాజకీయాలకు వేదికగా అవుతుందని అంటున్నారు.


Also read: Prashant Kishor Meet to Kcr: త్వరలో జాతీయ పార్టీ ఏర్పాటు..కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ మంతనాలు..!


Also read:Southwest Monsoon: ఆంధ్రావనిని తాకిన నైరుతి రాగం..రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి