Constable Murder: హైదరాబాద్‌ శివారులో పోలీస్‌ కానిస్టేబుల్‌ హత్య సంఘటన సంచలనంగా మారింది. సొంత తమ్ముడే ఆమెను అత్యంత దారుణంగా కడతేర్చాడు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జరిగిన ఈ సంఘటనలో విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. తన చెల్లెలు వివాహం చేసుకున్న తర్వాత వేరొక వ్యక్తితో ప్రేమలో ఉండడం.. అనంతరం మొదటి భర్తను వదిలేసి రెండో పెళ్లి చేసుకోవడం హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chevella Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైతులపై దూసుళ్లిన లారీ.. 10 మంది దుర్మరణం..!


సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా రాయపోలు గ్రామానికి చెందిన నాగమణి హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేది. ఆమె తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందగా..  తమ్ముడు పరమేశ్‌ ఉన్నాడు. గతంలో నాగమణికి ఒకరితో వివాహం జరిగింది. అయితే పది నెలల కిందట అతడితో విడాకులు తీసుకుంది. విడాకుల అనంతరం తనకు ఎప్పటి నుంచో తెలిసిన శ్రీకాంత్‌ను నాగమణి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గత నెల ప్రేమ వివాహం చేసుకుంది. అనంతరం వీరిద్దరూ హయత్‌నగర్‌లో కాపురం పెట్టారు. ఇంతలోనే ఈ ఘోర సంఘటన చోటుచేసుకుంది.

Also Read: Telangana Crime: తెలంగాణలో సంచలన ఘటనలు.. ఎస్సై ఆత్మహత్య.. కానిస్టేబుల్ దారుణ హత్య


తన భార్య నాగమణి హత్యపై తాజా భర్త శ్రీకాంత్‌ కీలక విషయాలు వెల్లడించారు. తనకు నాగమణి ఎప్పటి నుంచో తెలుసు అని.. ఆమెకు ఉద్యోగం రావడానికి చాలా సహాయం చేసినట్లు వెల్లడించారు. '8 సంవత్సరాలుగా నాగమణి, నేను ప్రేమించుకుంటున్నా. ఆమె కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించేందుకు నేను సహకరించడంతో 2021లో ఆమెకు ఉద్యోగం వచ్చింది. గత నెలలోనే యాదాద్రి దేవాలయంలో వివాహం చేసుకున్నాం. పెళ్లయిన తర్వాత ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాం' అని శ్రీకాంత్‌ తెలిపాడు.


పెళ్లి చేసుకున్న తర్వాత తమకు నాగమణి కుటుంబసభ్యుల నుంచి బెదిరింపులు వచ్చాయని శ్రీకాంత్‌ సంచలన విషయం వెల్లడించాడు. ఆమె కుటుంబసభ్యులు చంపుతామని బెదిరింపులు చేశారని తెలిపాడు. సెలవు రోజు కావడంతో స్వగ్రామానికి వెళ్లామని.. అంతలోనే తన భార్య 'తమ్ముడు కొడుతున్నాడు అంటూ కంగారుగా మాట్లాడింది' అని వాపోయాడు. అంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని శ్రీకాంత్‌ వివరించాడు. కాగా ఈ హత్యపై శ్రీకాంత్‌ కుటుంబసభ్యులు ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆందోళన చేపడుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.