Hyderabad gang rape case: హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో ట్వీస్ట్..రిమాండ్ రిపోర్టులో ఏముందంటే..!
Hyderabad gang rape case: హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా అమ్నీషియా పబ్ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Hyderabad gang rape case: హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా అమ్నీషియా పబ్ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలితోపాటు మరో మైనర్ బాలికను నిందితులు వేధించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈకేసులో కార్పొరేటర్ కుమారుడే కీలక సూత్రాధారిగా గుర్తించారు. సాదుద్దీన్ మాలిక్‌తో కలిసి పబ్‌లో అరాచకాలు సృష్టించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
సాదుద్దీన్ మాలిక్, కార్పొరేటర్ కొడుకు కలిసి ఇద్దరు బాలికలకు వేధించారని..దీంతో వారు బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పబ్ నుంచి బయటకు వచ్చిన బాలిక నేరుగా క్యాబ్ తీసుకుని వెళ్లింది. మైనర్ బాలికలను బయటకు వెళ్లే విషయం గమనించిన నిందితులు..వారి వెంటపడారని విచారణలో తేలింది. పబ్ ముందు క్యాబ్ కోసం నిలుచున్న మరో బాలికను కార్పొరేటర్ కొడుకు ట్రాప్ చేశాడు.
ఇంటి వద్ద దించుతామని నమ్మించారు. మాజీ ఎమ్మెల్యే మనవడు ఉమేర్ ఖాన్ చెందిన బెంజ్ కారులో మైనర్ బాలికతో కలిసి నలుగురు ప్రయాణం చేశారు. పబ్ నుంచి నేరుగా కాన్సూ బేకరికి వెళ్లారు. బెంజ్ కారులోనే బాలిక పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆమె బేకరిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు. బాధితురాలిని మళ్లీ బెంజ్ కారులో ఎక్కించుకుని కొద్ది దూరం వెళ్లారు.
ఆ సమయంలో ఫోన్ కాల్ రావడంతో ఎమ్మెల్యే కుమారుడు అక్కడి నుంచి దిగిపోయాడు. బెంజ్ కారులో పెట్రోల్ అయ్యిపోయిందంటూ డ్రామాలు ఆడి..మరో కారులో ఎక్కించారు. ఆ కారును వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడు తీసుకొచ్చినట్లు తేలింది. బంజారాహిల్స్‌లో నిర్మానుష్య ప్రాంతానికి బాధితురాలిని తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు. ఘటన తర్వాత నిందితులంతా బేకరికి వచ్చినట్లు సీసీ ఫుటేజీలో గుర్తించామని పోలీసులు తెలిపారు.
అక్కడే ఎంజాయ్ చేశామంటూ గ్రూప్ ఫోటో దిగారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈవెంటనే వారంతా నగర శివారులోని వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఫాంహౌస్ వెళ్లారని గుర్తించారు. ఆ తర్వాత ప్రణాళిక ప్రకారం పారిపోయారని విచారణలో తేలింది. అక్కడే కారును పోలీసులు గుర్తించారు. అక్కడ కీలక ఆధారాలను సేకరించారు. కారులో ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈకేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో కీలక నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Also read: Telangana Bonalu-2022: తెలంగాణలో బోనాల జాతరకు వేళాయే..పండుగ ఎప్పటి నుంచి అంటే..!
Also read:Pawan Kalyan Comments: హైదరాబాద్ గ్యాంగ్ రేప్ ఘటనపై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook