Telangana Bonalu-2022: తెలంగాణలో బోనాల జాతరకు వేళాయే..పండుగ ఎప్పటి నుంచి అంటే..!

Telangana Bonalu-2022: తెలంగాణలో బోనాల జాతర రాబోతోంది. ఈనెల 30న గోల్కొండ బోనాలతో ఆషాడ పండుగ ప్రారంభమవుతుంది.

Written by - Alla Swamy | Last Updated : Jun 6, 2022, 02:29 PM IST
  • త్వరలో తెలంగాణలో బోనాల జాతర
  • గోల్కొండ బోనాలతో పండుగ ప్రారంభం
  • బోనాలపై మంత్రుల సమీక్ష
Telangana Bonalu-2022: తెలంగాణలో బోనాల జాతరకు వేళాయే..పండుగ ఎప్పటి నుంచి అంటే..!

Telangana Bonalu-2022: తెలంగాణలో బోనాల జాతర రాబోతోంది. ఈనెల 30న గోల్కొండ బోనాలతో ఆషాడ పండుగ ప్రారంభమవుతుంది. జూలై 17న సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు, 18న రంగం, భవిష్య వాణి జరగనుంది. జూలై 24న హైదరాబాద్‌ బోనాల ఉత్సవం జరుగుతుంది. జూలై 25న ఉమ్మడి దేవాలయాల ఘాట్టాల ఊరేగింపు ఉంటుంది. జూలై 28న గోల్కొండ బోనాలతో పండుగ ముగియనుంది.

ఆషాడ బోనాల నిర్వహణపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. బోనాలు ఘనంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చూడాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి బోనాలు ప్రతీక అని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో పండుగలన్నీ నిర్వహిస్తున్నామన్నారు.

బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. ప్రభుత్వం తరపున వివిధ ఆలయాల్లో అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ ఉంటుందని తెలిపారు. 3 వేలకు పైగా ఆలయాలకు రూ.15 కోట్ల ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు. బోనాల సమీక్ష సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేయర్ విజయలక్ష్మీ,ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Also read: Suriya Remuneration:  విక్రమ్‌ సినిమా గెస్ట్ రోల్‌కి సూర్య ఎంత తీసుకున్నాడో తెలుసా.. అస్సలు ఊహించలేరు!  

Also read:Ka Paul Comments: అలా జరిగితే నేనే పీఎం..పవన్ సీఎం..కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News