Metro Parking Fees: ప్రజా రవాణాలో కీలక భూమిక పోషిస్తున్న హైదరాబాద్‌ మెట్రో రైలు సేవలు మరింత భారం కానున్నాయి. ఇప్పటకే అధిక ఛార్జీలతో సతమతమవుతున్న ప్రయాణికులకు మరో భారం మోపైంది. ఇప్పటివరకు ఉచితంగా ఉన్న పార్కింగ్‌కు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే. మొన్నటివరకు ఉచితంగా ఉన్న టాయ్‌లెట్‌ వినియోగానికి ధరలు ప్రవేశపెట్టగా.. తాజాగా ఇప్పుడు పార్కింగ్‌ ఛార్జీలు మోపనుండడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఛార్జీలు పెంచుతున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Mastan Sai Arrest: డ్రగ్స్‌ కేసులో మస్తాన్‌ సాయి అరెస్ట్‌.. అతడు ఎవరి కొడుకో తెలిస్తే షాకవుతారు


 


25, 1వ తేదీ నుంచి
ఈ సందర్భంగా మెట్రో స్టేషన్‌లో చార్జీల పెంపుపై హెచ్‌ఎంఆర్‌ఎల్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఈనెల 25వ తేదీ నుంచి పార్కింగ్‌ ఛార్జీలు విధిస్తామని ప్రకటించింది. ఇక మియాపూర్ మెట్రో స్టేషన్‌లో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తామని వెల్లడించింది. అయితే నాగోల్‌లో ప్రయోగాత్మకంగా పార్కింగ్‌ ఛార్జీలు ప్రకటించినట్లు వివరించింది. 

Also Read: KT Rama Rao: కాంగ్రెస్‌లోకి వెళ్లాక ఫాపం పోచారం పరిస్థితి.. పార్టీ శ్రేణులతో కేటీఆర్‌ విచారం


వివిధ వ్యవస్థల పనితీరు, సమర్ధతను పరీక్షించేందుకు పైలట్ ప్రాతిపదికన నాగోల్ పార్కింగ్‌ కేంద్రంలో ట్రయల్స్ నిర్వహించినట్లు హెచ్‌ఆర్‌ఎంఎల్‌ తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. అయితే పార్కింగ్‌ ఫీజుల వసూలుతో ప్రయాణికులకు చాలా సౌకర్యాలు అందిస్తున్నట్లు వెల్లడించింది. పార్కింగ్‌ కేంద్రాల్లో అందిస్తున్న సేవలను వివరించింది.


పార్కింగ్ కేంద్రాల్లో ప్రత్యేకతలు


  • క్రమబద్ధమైన పార్కింగ్: ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలకు మధ్య స్పష్టమైన హద్దులు

  • మీ సౌకర్యార్థం బయో-టాయ్‌లెట్లు 

  • భద్రత: 24/7 CCTV నిఘా మరియు ఆన్-గ్రౌండ్ భద్రత 

  • చెల్లింపు విధానాలు: సులభతరంగా యాప్-ఆధారిత (క్యూఆర్ కోడ్) చెల్లింపు ఆప్షన్లు

  • లైటింగ్: సురక్షితమైన అనుభూతి కోసం మెరుగైన లైటింగ్


ప్రయాణికుల ఆందోళన
ప్రయాణికుల సౌకర్యార్థం పార్కింగ్ ఫీజు వివరాలు రెండు ప్రాంతాల్లోను స్పష్టంగా కనిపించేటట్లు ప్రదర్శిస్తామని ప్రకటించింది. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, పద్ధతి ప్రకారంగా ఉండే పార్కింగ్ అనుభూతి కల్పిస్తున్నట్లు ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ తెలిపింది. ప్రయాణికులు సహకారం అందించాలని విజ్ఞప్తి చేసింది. పార్కింగ్ ఛార్జీలు అమల్లోకి తీసుకురావడంతో ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter