Mallareddy Hospital Video Viral: మల్లారెడ్డి ఆస్పత్రి వద్ద దారుణం చోటు చేసుకుంది నిన్న శనివారం వైద్యుల నిర్లక్ష్యంతో యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే. అక్కడి పరిస్థితులపై కవరేజీ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మల్లారెడ్డి ఆసుపత్రి బౌన్సర్లు పరిగెత్తించి మరీ కొట్టారు. ఈ ఘటన సూరారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రశ్నించడానికి వెళ్లిన జర్ననిస్టులపై ఇలాంటి దారుణ చోటు చేసుకోవడం గమనార్హం. ఆస్పత్రిలో యువతి మృతి కేసుకు సంబంధించి కవరేజీకి వెళ్లిన జర్ననిస్టులపై ఇలా చేయి చేసుకోవడం ఏంటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వీడియో ఆస్పత్రి బయటే రిపోర్టర్లు కవరేజీ ప్రారంభించారు. వారిని చుట్టుముట్టి పలువురు ఆస్పత్రి బౌన్సర్లు ఉన్నరు. ఇక రిపోర్టర్లు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఘటన తీరుపై ఆరాతీసేందుకు వారు ప్రయత్నించారు. దీంతో ఆస్పత్రి బౌన్సర్లు వారిని ఒక్కసారిగా అడ్డుకుని దాడి చేశారు. కవరేజీ చేస్తాం జర్నలిస్టులనే కొడతారా? అంటున్న వినిపించుకోకుండా చుట్టుముట్టి జర్నలిస్టులను పరిగెత్తించి మరీ చేయి చేసుకున్నారు. 


మహిళ మృతి ఘటన..
డాక్టర్ల నిర్లక్ష్యంతో మల్లారెడ్డి ఆస్పత్రిలో ఓ మహిళ మృతి చెందింది. కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయని చెప్పడంతో మాధవి అనే మహిళ హైదరాబాద్‌లో ఉన్న మల్లారెడ్డి ఆసుపత్రిలో ఆపరేషన్‌కు వచ్చింది. మల్లారెడ్డి ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్‌ చేస్తుండగా సదరు యువతికి తీవ్ర రక్తస్రావం అయింది. కొన్ని గంటల సమయం వరకు ఆ విషయం కూడా పేషంట్‌ బంధువులకు ఆస్పత్రి యాజమాన్యం చెప్పలేదు. పేషంట్‌ పరిస్థితి ఏంటని ప్రశ్నించగా ఆపరేషన్‌కు ఇంకా సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. ఈలోగా ఆ యువతి చనిపోయింది. 


ఇదీ చదవండి : తెలంగాణ ప్రభుత్వం 2025 సెలవుల ప్రకటన.. 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు ఎప్పుడంటే..?


ఆస్పత్రికి వైద్యం కోసం వస్తే మహిళ ప్రాణం తీశారని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యం వికటించిన మహిళ పరిస్థితి బుకాయించారు, వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఎదుట ధర్నాకు సైతం దిగారు. దీనిపై డీఎంహెచ్‌ఓ కూడా విచారణ చేపట్టారు.


ఇదీ చదవండి:  త్వరపడండి బీఎస్ఎన్ఎల్ బంపర్ ఛాన్స్.. రూ.700 లోపే 100 రోజుల రీఛార్జ్ ప్లాన్..


 




 


 


ఈ సందర్భంగా ఈ మృతిపై కవరేజీ కోసం వెళ్లిన ఓ టీవీ ఛానల్‌ రిపోర్లపై మల్లారెడ్డి ఆస్పత్రి బౌన్సర్లు చేయిచేసుకున్నారు. అత్యంత దారుణంగా వారిని చుట్టు ముట్టి పరిగెత్తించి మరీ కొట్టారు. సోషల్‌ మీడియాలో ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఆర్‌ టీవీ జర్నలిస్టు రంజిత్‌ను అరెస్టు చేసిన రోజే జర్ననిస్టులపై ఈ మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. రంజిత్‌ అరెస్టు విషయంలో హరీష్‌ రావు వంటి ప్రముఖ రాజకీయ నాయకులు ఖండించారు. రంజిత్‌కు నిన్న బెయిల్‌ కూడా లభించింది. ప్రశ్నించడానికి, ఘటన తీరును పరిశీలించడానికి కవరేజ్‌ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై ఇలాంటి దారుణ ఘటనలో చోటు చేసుకుంటే ఇక సాధారణ జనం పరిస్థితి ఏంటని పరువులు ప్రశ్నిస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook