ప్రభుత్వాసుపత్రి అంటే బాబోయ్ అనే ఈ రోజుల్లో సిద్ధిపేట ప్రభుత్వ వైద్యశాల చూస్తే ఆ భయం పోతుంది మరి. కార్పొరేట్ స్థాయి వసతులతో ఆకట్టుకుంటున్న ఈ ప్రభుత్వాసుపత్రి .. ఈ రోజు సరికొత్త రికార్డు సృష్టించింది. 24 గంటల వ్యవధిలో 33 ప్రసవాలు.. 17 సాధారణ ప్రసవాలు, 16 సిజేరియన్లు జరిగాయి..33 ప్రసవాల్లో 17 మంది ఆడబిడ్డలు, 16 మంది మగబిడ్డలు పుట్టారు. కాగా తల్లీ బిడ్డలంతా ఆరోగ్యంగా ఉండటం విశేషం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక్క రోజే.. 33 ప్రసవాలను విజయవంతంగా నిర్వహించడం వంటి అసాధారణ రికార్డును సిద్దిపేట ప్రభుత్వాసుపత్రి  వైద్యులు సాధించారనడంలో సందేహం లేదు. ఇది ప్రభుత్వ వైద్యంపై... ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు కలిగిన అపార నమ్మకానికి నిదర్శనంగా చెప్పువచ్చు. సదుపాయాలు పెంచితే ప్రభుత్వాసుపత్రుల నుంచి కూడా అద్భుత ఫలితాలు రాబట్ట వచ్చని సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రి నిరూపించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కాగా సిద్ధిపేట కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు నియోజరవర్గం కావడం గమనార్హం.


సీఎం కేసీఆర్ చిన్నారుల కోసం కిట్ పథకం కోసం రూ.10 కోట్లను కేటాయించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వాసుప్రతిలో పుట్టిన ప్రతి బిడ్డకు కిట్ అందిస్తారు. అలాగే ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగపిల్లవాడు పుడితే రూ.12 వేలు ఆర్థికసాయం అందిస్తోంది తెలంగాణ సర్కార్. ఇలాంటి పథకాలు జనాలను ప్రభుత్వాసుల వైపు మొగ్గుచూపడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.