Sisters Tie rakhi to younger brother from hostel in ramakrishnapur mancherial: రాఖీని దేశ వ్యాప్తంగా ఎంతో పండుగలా జరుపుకుంటున్నారు. సోదరులు, సోదరీమణుల ఆప్యాయతను,ప్రేమను చాటు గొప్ప పండలా దీన్నిచెబుతుంటారు. అయితే.. రాఖీ రోజు ఎక్కడున్న తమ వాళ్లదగ్గరకు వచ్చేస్తారు. చాలా మంది పెళ్లి కాకన్న ముందు ఒకే దగ్గర ఉండి తమ సోదరులకు రాఖీలు కడతారు. అదే విధంగా సోదరులు తమ అక్కలకు మంచి గిఫ్ట్ లు ఇచ్చి మరీ సర్ ప్రైజ్ లు చేస్తారు. రాఖీ పండుగ వెనుక అనేక పురాణ కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అంతటి గొప్పదైన రాఖీ పండుగను శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ క్రమంలో చాలా ప్రభుత్వాలు ఇప్పటికే రాఖీ పండగ నేపథ్యంలో హలీడే ను ప్రకటించాయి. కానీ తెలంగాణలో దీన్ని ఆప్షనల్ హలీడేగా ఇచ్చినట్లుతెలుస్తోంది. ఈ క్రమంలో మంచిర్యాలలోని రామక్రిష్ణ పూర్ లో జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్గా మారింది.


తెలంగాణలోని మంచిర్యాల జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. రామక్రిష్ణ పూర్ సోషల్ వేల్పేర్ గురుకుల పాఠశాలలో‌  దాసరి అశ్విక, సహస్ర చదువుతున్నారు. రాఖీ పండుగ నేపథ్యంలో.. తనఅక్కలతో రాఖీ ను కట్టించుకునేందుకు, వాళ్ల తమ్ముడు జితేంద్ర తండ్రితో కలిసి హస్టల్ కు వచ్చాడు. కానీ అక్కడి వార్డెన్ మాత్రం అనుమించలేదు. దీంతో అతను ఎంతగా ప్రాధేయ పడిన కూడా ఒప్పుకోలేదు.


Read more: Kolkata Doctor murder: ఆర్ జీ కర్ ఆస్పత్రి చీకటి బాగోతలు.. గతంలోని మరణాల మిస్టరీలు తెలిస్తే షాక్ అవుతారు..


దీంతో తన అక్కలతో ఎలాగైన సరే.. రాఖీ కట్టించుకొవాలని భావించారు. ఇంతలో అక్కలుంటున్న.. హస్టల్ కిటీకి దగ్గరకు చేరుకున్నారు. అక్కడ తండ్రి భుజం మీద కూర్చుని మరీ రాఖీలు కట్టించుకున్నాడు. తన అక్కలు కూడా, గారాల తమ్ముడికి రాఖీలు కట్టి ఆనందంతో పొంగిపోయారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు సదరు బాలుడ్ని శెభాష్ అంటూ పొగుడుతున్నారు. మరోవైపు.. హస్టర్ వార్డెన్ ను ఏకీపారేస్తున్నారు. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి