Six TRS candidates elected unanimously in Local body MLC elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఎమ్మెల్సీ పోరులో (MLC elections) ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి టీఆర్‌‌ఎస్ అభ్యర్థిగా దండెం విఠల్‌, ఇండిపెండెంట్ క్యాండెట్‌గా (Independent Candidate‌) పుష్పరాణి బరిలో నిలిచారు. ఇక ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 14 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో టీడీపీకి చెందిన భాను ప్రసాదరావు, ఎల్‌ రమణతో పాటు మరో 8మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ పోటీ చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ (Nalgonda) జిల్లాలో టీఆర్ఎఎస్ నుంచి కోటిరెడ్డి బరిలో నిలిచారు. ఈయనతో పాటు నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీపడనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెదక్‌ డిస్ట్రిక్ట్‌లో టీఆర్‌‌ఎస్ (TRS) అభ్యర్థిగా యాదవరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిర్మల, ఇండిపెండెంట్‌గా మల్లారెడ్డి బరిలో ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి టీఆర్‌‌ఎస్ తరఫున తాతా మధు, కాంగ్రెస్‌ నుంచి రాయల నాగేశ్వరరావు సహా మరో ఇద్దరు ఇండిపెండెంట్‌ క్యాండెట్స్ బరిలో నిలిచారు.


Also Read : Shiva Shankar Master: శివశంకర్ మాస్టర్ కుటుంబానికి మెగాస్టార్ ఆర్థిక సాయం


ఇక ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు (TRS candidates) ఏకగ్రీవమయ్యారు. రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, వరంగల్‌ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha), ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచికుళ్ల దామోదర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


Also Read : Chilli potato making video: చిల్లి పొటాటో చేయడంలో ఎవరైనా ఈ బుడ్డోడి తర్వాతేనట!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి