Snake Appears In Curry: మన తినే ఆహారంలో చిన్న వెంట్రుక వచ్చినా.. ఏదైనా రాయి తగిలినా.. చిన్న దోమ పడినా తినేందుకు ఎట్లో ఉంటుంది. కొంతమందికి కడుపులో కూడా తిప్పుతుంది. అలాంటిది ఏకంగా తినే పప్పులో పాము కనిపిస్తే.. వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోడి. హైదరాబాద్‌ చర్లపల్లిలోని ఈవీఎం కంపెనీ ఆహారంలో పాము దర్శనమివ్వడం కలకలం రేపుతోంది. అది ఎక్కడ మూల కాదు.. ఏకంగా ఉద్యోగులకు వడ్డించే పప్పులో.. దీంతో అక్కడి ఉద్యోగులు ఒక్కసారి భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ఆహారం తిన్న పలువురు అనారోగ్యానికి గురవ్వగా.. నలుగురు తీవ్ర అస్వస్థతకు గురుయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
కుషాయిగూడాలోని ఈసీఐఎల్ సెంట్రల్ క్యాంటీన్ నుంచి వండిన పదార్థాలను చర్లపల్లిలోని ఈవీఎం సంస్థ క్యాంటీన్‌కు పంపిస్తారు. అదే అక్కడ ఉద్యోగులకు వడ్డిస్తారు. అలా వడ్డిస్తున్న సమయంలో పప్పులో చచ్చిన  పాము పిల్ల బయటపడింది. అయితే ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా యజమాన్యం జాగ్రత్త పడింది. కానీ రాత్రి ఆ విషయం బయట పడటంతో ఉద్యోగులు తీవ్ రఆగ్రహం వ్యక్తం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో కూడా  క్యాంటీన్ వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగాయని  ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆహరంలో  ఎలకలు, బీడీ ముక్కలు, సిగరెట్‌ పీకలు, బొద్దింకలు వస్తాయంటున్నారు. ఆహార విషయంలో ఈసీఐఎల్ క్యాంటీన్ అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. క్యాంటిన్‌ ఘటనపై విచారణ జరిపి, ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 


వేల కార్మికులకు భోజనం అందించే ఈసీఐఎల్ క్యాంటీన్‌ సిబ్బంది నిర్లక్ష్యంపై అన్ని వైపులా నుంచి విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగులు ఆహార పదార్థాల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిని సస్పెండ్ చేయాలని అంటున్నారు. కంపెనీ యాజమాన్యంపై ఫుడ్ ఇన్స్పెక్టర్లు కేసు నమోదు చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేయించి.. ఇక నుంచి అయినా నాణ్యమైన ఆహారం అందజేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈసీఐఎల్ కంపెనీ నిర్లక్ష్యంపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి. 


Also Read: Special Train: గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. వారి కోసం స్పెషల్ ట్రైన్స్  


Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook