Software engineer suicide: చికిత్స కోసం వెళ్లి.. ఆసుపత్రిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
Suicide: చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన యువతి మరో నాలుగైదు గంటల్లో ఇంటికి వెళ్లాల్సి ఉండగా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరబాద్ లో జరిగింది.
Software Engineer Suicide: హైదరాబాద్(hyderabad)లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి(Software employee)ని ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లిన యువతి మరో నాలుగైదు గంటల్లో ఇంటికి వెళ్లాల్సి ఉండగా ఉరి వేసుకొని బలవన్మరణాని(Suicide)కి పాల్పడింది. ఈ మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రాజేంద్రనగర్ సీఐ కనకయ్య తెలిపిన వివరాల మేరకు,,,ఏపీ నెల్లూరుకు చెందిన సుదీప్తి(27) అవివాహిత. ఆమె బండ్లగూడజాగీర్‌లోని అపార్ట్‌మెంట్లో ఉంటూ ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. ఈ నెల 6న అనారోగ్యంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రి(Private hospital)కి వెళ్లింది. మూడు రోజులుగా చికిత్స తీసుకుంటూ పూర్తిగా కోలుకున్నారు.
Also Read: Suicide: కుమారుడి మరణ వార్త విని....ప్రాణాలు తీసుకున్న తల్లి, అమ్మమ్మ
మంగళవారం మధ్యాహ్నం డిశ్ఛార్జి కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఉదయం 9గంటల సమయంలో ఆమె గదిలోకి నర్సు వెళ్లగా లోపలి నుంచి తలుపు గడియపెట్టుకొని ఉంది. సిబ్బంది తలుపు బద్దలు కొట్టి లోపలికెళ్లారు. సుదీప్తి ఫ్యానుకు ఉరి వేసుకొని వేలాడుతూ(Suicide) కనిపించింది. ఆసుపత్రి నిర్వాహకులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. యువతి తల్లి బెంగళూరులో ఆమె సోదరుడి దగ్గర ఉంటోంది. యువతి ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడిందో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook