Software Family Suicide : నుదట ఎర్రటి బొట్లతో ఆత్మహత్యకు పాల్పడ్డ సాఫ్ట్వేర్ కుటుంబం
Software Family Suicide Sangareddy District: సాఫ్ట్‌వేర్‌గా పని చేసే ఒక వ్యక్తి.. కూతురు, భార్యతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గదిలో దేవుడి గదిలో చిత్ర పటాలు బోర్లించి ఉండడంతో ఈ ఆత్మహత్యలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Software Family Suicide in Ameenpur : వారిద్దరి కులాలు వేరయినా కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఏడేళ్ల కుమార్తె ఉంది. అయితే రెండ్రోజులుగా కనిపించడంలేదంటూ కుటుంబ సభ్యులు అందించిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. తర్వాత పోలీసులు వెళ్లి వారి ఇంటి తలుపులు తెరిచి చూశారు.
అయితే అప్పటికే ఆ ఏడేళ్ల చిన్నారితో పాటు తల్లి కూడా నురగలు కక్కుతూ విగతజీవులుగా కనిపించారు. ఇక తండ్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా (Sangareddy District) అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
అమీన్‌పూర్ (Ameenpur) వందనపురి కాలనీలో ఏడేళ్ల చిన్నారితో పాటు దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. షాద్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్, ఆల్వాల్‌కు చెందిన అనామికకు 10 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి స్నిగ్ధ అనే 7 సంవత్సరాల కూతురు ఉంది.
శ్రీకాంత్ గౌడ్ (42) సాఫ్ట్‌వేర్‌గా (Software) పని చేసేవారు. అనామిక (40) స్థానికంగా ఉన్న ఒక కార్పొరేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేసేవారు. అయితే రెండు రోజులుగా వారు కనిపించలేదు. అలాగే అనామిక తండ్రి శ్రీరామచంద్రమూర్తి ఫోన్ చేసినా కూడా ఎవరూ స్పందించలేదు.
Also Read : AP Corona cases: ఏపీలో కొత్తగా 12,615 కరోనా కేసులు, ఐదు మరణాలు
దీంతో ఆయన వందనపురి కాలనీలోని శ్రీకాంత్ నివాసానికి వెళ్లి చూశారు. తలుపులు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు శ్రీరామచంద్రమూర్తి.పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా, పాప స్నిగ్ధతో పాటు తల్లి అనామిక విగతజీవులుగా కనిపించారు. అలాగే పక్క గదిలో శ్రీకాంత్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. అయితే వారి నుదుటన పెద్ద పెద్ద ఎర్రటి బొట్లు ఉన్నాయి. అలాగే దేవుడి గదిలో చిత్ర పటాలు బోర్లించి ఉండడం వల్ల ఈ ఆత్మహత్యలపై (Suicide) పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
Also Read : Three Eyed Calf Died: మూడు కళ్లతో జన్మించిన వింత లేగదూడ మృతి.. పుట్టిన వారం రోజులకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook