Three Eyed Calf Died: ఛత్తీస్‌గఢ్ రాజ్‌నందగావ్ జిల్లాలో మూడు కళ్లు, ముక్కులో నాలుగు రంధ్రాలతో పుట్టిన వింత ఆవుదూడ.. వారం రోజులకే మృతి చెందింది. గురువారం ఉదయం దూడ మరణించినట్లు రైతు హేమంత్ చందేల్ తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ లోని రాజ్‌నందగావ్ జిల్లాలోని నవాగావ్‌కు చెందిన రైతు హేమంత్ చందేల్ కు వ్యవసాయంతో పాటు ఆవులు కూడా పెంచుతున్నాడు. బుందేలి గ్రామ రైతు అయిన చందేల్‌కు చెందిన జెర్సీ ఆవు వింత దూడకు జన్మించింది. గత శుక్రవారం (జనవరి 14) రాత్రి 7 గంటల సమయంలో ఆవు.. దూడకు జన్మనిచ్చింది.
ఆ దూడ మూడు కళ్లు, ముక్కులో నాలుగు రంధ్రాలతో పుట్టింది. దాంతో ఆ రైతు ఆశ్చర్యపోయాడు. వెంటనే పశువైద్యులకు సమాచారం ఇవ్వగా.. వారు దూడకు పరీక్షలు నిర్వహించారు. పిండం సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇలా పుట్టిందని పశువైద్యులు చెప్పారు.
పిండం సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇలా జరుగుతుందని స్థానిక పశువైద్యుడు డాక్టర్ సందీప్ ఇదుర్కర్ తెలిపారు. సాధారణంగా అలాంటి దూడలు చాలా బలహీనంగా ఉంటాయని, ఎక్కువ రోజులు జీవించలేవన్నారు. ఈ దూడ సైతం ఎక్కువ రోజులు జీవించలేదని ముందుగానే ఊహించామని చెప్పారు. ఇలాంటి వాటిని దేవుడికి ఆపాదించకూడదని ప్రజలకు సూచించారు.
శివుని అనుగ్రహం అని ప్రజలు నమ్మకం
సంక్రాంతి ముందు జన్మించడం వల్ల శివుడిగా భావించారు. దానిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు రైతు ఇంటికి తరలివచ్చారు. కొందరు దేవుడి ప్రతిరూపంగా భావిస్తూ పూజలు చేశారు. ఇప్పుడు ఆ వింత ఆవు దూడ మరణించినట్లు తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో.. చండేల్ ఇంటికి చేరుకుని అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Also Read: India Covid Cases Today: దేశంలో 3 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదు- పెరిగిన మరణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook