Mettuguda rail nilayam train fire accident: సికింద్రాబాద్ లోని రైల్ నిలయం వద్ద షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కాసేపటి క్రితం.. మెట్టుగూడ వద్ద ఆగిఉన్న రైలు భోగీల నుంచి మంటల  చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో.. రెండు భోగీలు పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది.   సెకన్ల వ్యవధిలోనే మంటలు ఉవ్వేత్తున ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేసేందుకు చర్యలు చేపట్టారు  భారీగా పొగ కమ్ముకోవడంతో చుట్టు పక్కల ఉన్న జనం భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో కూడా చాలా సేవు ఎవరికి అర్థం కాలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఆ తర్వాత బ్రిడ్జీపైన.. నిలిచి ఉన్న బోగీల నుంచి మంటలు చెలరేగాయని గుర్తించారు. ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భోగీలకు వ్యాపించిన మంటలతో ఆ ప్రాంత మంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో ఫైర్ సిబ్బంది వచ్చి, మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు.  ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఇదిలా ఉండగా ఇటీవల వరుసగా రైల్వే ప్రమాద ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. కొద్దిరోజుల క్రితమే.. వెస్ట్ బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచన జంగ ఎక్స్ ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలు మీదకు ఎక్కేసింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలు ప్రయాణికులు తమ ప్రాణాలు కోల్పోయారు.


Read more: Viral News in Telugu: కొంపముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో


ఈ ఘటనపై కూడా కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ సీరియస్ గా స్పందించింది. వెస్ట్ బెంగాల్ లో.. ఘటనపై సీఎం మమతా కూడా కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై రైల్వేమినిస్టర్ నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక కేంద్రం కవచ్ వ్యవస్థ ఏంచేస్తుందంటూ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. సికింద్రాబాద్ రైలు ప్రమాద ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు.  అగ్రి ప్రమాద ఘటనపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి